చిత్తూరులో ఇద్దరు అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్

ABN , First Publish Date - 2022-07-23T11:46:09+05:30 IST

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను శ్రీకాళహస్తి డీఎస్పీ విశ్వనాథ్‌ నారాయణవనం పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం

చిత్తూరులో ఇద్దరు అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్

చిత్తూరు: ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను శ్రీకాళహస్తి డీఎస్పీ విశ్వనాథ్‌ నారాయణవనం పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఈనెల 3వ తేదీన పాలమంగళం వద్ద ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం షట్టర్‌ తాళాలు పగలగొట్టి రూ.5,40,830తో పాటు రెండు మద్యం బాటిళ్లను దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై మద్యం దుకాణ ఇన్‌చార్జి శరవణకుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారాయనవనం సీఐ సురే్‌షకుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. గురువారం సాయంత్రం పుత్తూరు - ఊత్తుకోట బైపాస్‌ రోడ్డు వైఎస్సార్‌ జంక్షన్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా మద్యం దుకాణంలో చోరీకి ప్పాడినట్లు అంగీకరించారు. నిందితులిద్దరూ తమిళనాడుకు చెందిన తమిళరసన్‌, ఆనంద్‌గా గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.3,12000 స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. మన రాష్ట్రంతోపాటు తమిళనాడులోనూ వీరిపై పలు కేసులు ఉన్నాయన్నారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులకు రివార్డు ప్రకటించారు.

Updated Date - 2022-07-23T11:46:09+05:30 IST