చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగ అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-10-30T11:37:46+05:30 IST

పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ అంత రాష్ట్ర దొంగను పోలీసులు అదపులోకి తీసుకున్నారు.

చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగ అరెస్ట్‌

1.50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు రికవరీ


అశ్వారావుపేట, అక్టోబర్‌ 29: పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ అంత రాష్ట్ర దొంగను పోలీసులు అదపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి సొత్తును రికవరీ చేశారు. ఇందుకు సంబంధించిన వి వరాలను గురువారం అశ్వారావుపేట పోలీసులు వెల్లడించారు. గురువారం పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో సీఐ ఉపేందర్‌ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు. ఆంధ్రపదేశ్‌ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లికి చెందిన గుండెల్లి శ్యాంబాబు ఈనెల 24న పట్టణంలోని అంపోలు మహాలక్ష్మి ఇంట్లో చోరీ చేశాడు. గురువారం తెల్లవారు జామున రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టువద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా శ్యాంబాబు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని ప్రశ్నించినట్టు సీఐ తెలిపారు.

విచారణలో మహాలక్ష్మి ఇంట్లో చోరీకి పాల్పడినట్టు నిందితుడు అంగీకరించినట్టు ఆయన తెలిపారు. దీంతో నిందుతుడితో పాటు చోరీ చేసిన రూ.1.50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నట్లు సీఐ తెలిపారు. శ్యాంబాబు గతంలో పలుకేసుల్లో నిందుతుడిగా ఉన్నట్టు ఆయన తెలిపారు. సొత్తును, నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టుకు పంపుతున్నట్టు సీఐ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రజలు మాల్స్‌, దుకాణాలవద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేర నియంత్రణకు సహకరించాలని కోరారు. సమావేశంలో ఎస్‌ఐ మధు ప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-30T11:37:46+05:30 IST