Abn logo
Sep 25 2021 @ 19:05PM

పశ్చిమ గోదావరి జిల్లాలో అంతరాష్ట్ర మద్యం పట్టివేత

పశ్చిమ గోదావరి: జిల్లా గుండా అక్రమంగా తరలిస్తున్న అంతరాష్ట్ర మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తాడేపల్లిగూడెం, పెద్దతాడేపల్లిలో మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, యానాం రాష్ట్రాల నుంచి 436 మద్యం తరలిస్తున్నారు. దీనితో  సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను సెబ్ అధికారులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి ఒక బొలెరో, ఒక ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసారు. 90 వేలు విలువ కలిగిన 436 బాటిల్స్, 2 లక్షల విలువ కలిగిన బోలోరో వాహనం, 50 వేలు విలవ కలిగిన పల్సర్ బైక్, 4గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు. 

చిత్తూరు జిల్లాలో.. 

చిత్తూరు: జిల్లా గుండా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మదనపల్లె పట్టణంలో కర్నాటక మద్యం, నాటుసారా అమ్ముతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేసారు. నిందితుల వద్ద నుంచి మూడు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...