Abn logo
Oct 28 2021 @ 00:39AM

ఇసుక టిప్పర్ల అడ్డగింత

మాల్యంలో టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్థులు

కణేకల్లు, అక్టోబరు 27: మండలంలోని మాల్యం గ్రామంలో బుధ వారం స్థానికులు ఇసుక టిప్పర్లను అడ్డుకున్నారు. టిప్పర్ల రాకపోకలతో దాదాపు 50 యేళ్ల క్రితం నిర్మించిన హెచ్చెల్సీ బ్రిడ్జి ఇప్పటికే శిథిలావస్థకు చేరుకుందని వాపోయారు. కూలేందుకు సిద్ధంగా వుండగా రోజూ వందలాది ఇసుక టిప్పర్లు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదకరంగా మారుతోందన్నారు. బ్రిడ్జి కూలిపోతే పలు గ్రామాలకు వెళ్లే రహదారి పూ ర్తిగా స్తంభించి పోతుందని తెలిపారు. దాదాపు రెండు గంటలపాటు వాహన రాకపోకలను అడ్డుకోవడంతో ఎక్కడి టిప్పర్లు అక్కడే నిలబడిపోయాయి. కార్యక్రమంలో గ్రామస్థులు తిప్పారెడ్డి, మరేగౌడ, గురు, సు ధాకర్‌, శశికుమార్‌, రామాంజనేయులు, శ్రీనివాసులు పాల్గొన్నారు.