వర్షాలతో ఇసుక సరఫరాకు ఆటంకాలు

ABN , First Publish Date - 2020-08-10T08:00:57+05:30 IST

జిల్లా వ్యాప్తంగా 380 పైచిలుకు పాఠశాలల్లో ఇసుక నిల్వలు నిండుకున్నాయి. దీంతో ఆయా పాఠశాలల్లో జరుగుతున్న ‘నాడు - నేడు’ పనులకు భారీగా ఇసుక కొరత ఏర్పడింది.

వర్షాలతో ఇసుక సరఫరాకు ఆటంకాలు

నిండుకున్న ఇసుక నిల్వలు...!

- వర్షాలతో ఇసుక సరఫరాకు ఆటంకాలు

- 380 పై చిలుకు పాఠశాలల్లో సమస్య

- ఆగిన పలు రకాల పనులు 

- ‘నాడు-నేడు’ పనుల్లో మందగించిన పురోగతి


అనంతపురం విద్య, ఆగస్టు 9 :   జిల్లా వ్యాప్తంగా 380 పైచిలుకు పాఠశాలల్లో ఇసుక నిల్వలు నిండుకున్నాయి. దీంతో ఆయా పాఠశాలల్లో జరుగుతున్న ‘నాడు - నేడు’ పనులకు భారీగా ఇసుక కొరత ఏర్పడింది.  ఫలితంగా టాయిలెట్లు, స్లాబ్‌, ప్లాస్టరింగ్‌, ఎలెక్ర్టిసిటీ వైరింగ్‌ తదితర పనులు ఆగిపోయాయి. అధికారుల్లో ముందుచూపు లోపించడం వల్ల ఇటీవల జిల్లాలో నిత్యం కురుస్తున్న వర్షాలు ఇసుక సరఫరాకు ప్రధానంగా ఆటంకంగా నిలుసు ్తన్నాయి. ఫలితంగా రాష్ట్రంలోనే నాడు-నేడు పనుల పురోగతిలో జిల్లా స్థానం వెనుకబడుతోంది.


సుమారు 20 రోజులకు పైగా...

జిల్లా వ్యాప్తంగా 1255  పాఠశాలల్లో టాయిలెట్లు, తాగునీటి వ్యవస్థ, వి ద్యుదీకరణ పనులు, మేజర్‌, మైనర్‌ మరమ్మతుల పనులు నత్తనడకన సాగు తున్నాయి. వీటికి 20 రోజులుగా ఇసుక కొరత ఏర్పడింది. దీంతో ప్రధానోపా ధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో 380కి పైగా పాఠశాలల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఉన్న ఇసుక నిల్వలతోనే ప్లాస్టరింగ్‌ పనులు చేయిద్దామ న్నా...తరచూ వర్షం ఆటంక పరుస్తోంది.  ఇదిలా ఉండగా పలు కంపెనీల నుంచి సిమెంట్‌ కూడా సరిపడా రావడంలేదని సమాచారం. 


పనుల్లో సాగుతూ....జోగుతూ.....

జిల్లాలో మొదటి విడత నాడు-నేడు కింద 1255 పాఠశాలలను ఎంపికచే శారు. వీటిలో 1198 పాఠశాలల్లో నీటి సదుపాయంతో కూడిన టాయిలెట్ల నిర్మాణానికి పనులు మంజూరుచేశారు. ఇందులో 1181 పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి. 31 పాఠశాలల్లో ఫౌండేషన్‌ లెవల్‌, 88 స్కూళ్లలో లింటిల్‌ లెవల్‌ వరకు, 595 స్కూళ్లలో రూప్‌ వేయడం వరకు పనులు పూర్తి చేశారు. 386 స్కూళ్లలో సెప్టిక్‌ ట్యాంకు పనులు పూర్తి చేయగా.


మరో 81 స్కూళ్లలో ఫిక్సింగ్‌ పనులు పూర్తయ్యాయి. తాగునీటి పనులు పరిశీలిస్తే....1209 స్కూళ్లకు పనులు మంజూరు కాగా 1205 స్కూళ్లలో పనులు సాగుతున్నాయి. 277 స్కూ ళ్లలో 33 శాతం, 747 స్కూళ్లలో 66 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం 181 స్కూళ్లలో మాత్రమే  వందశాతం పనులు పూర్తిచేయగలిగారు. ఇక విద్యుద్దీకరణ పనులు 1234 స్కూళ్లలో మంజూరు కాగా 1229 స్కూళ్లలో జరుగుతున్నాయి. 49 స్కూళ్లలో మాత్రమే వైరింగ్‌ పూర్తి చేయగా 1015 స్కూ ళ్లలో ట్యూబ్‌లైట్ల ఫిట్టింగ్‌, 165 స్కూళ్లలో ఫ్యాన్లు ఏర్పాటు చేశారు.


మేజర్‌ మైనర్‌ రిపేరీ పనులు పరిశీలిస్తే.... 1223 స్కూళ్లకు పనులు మంజురు కాగా 1220 స్కూళ్లలో పనులు జరుగుతున్నాయి.137 స్కూళ్లలో 33 శాతం పనులు చేయగా,  66 శాతం పనులు  835 స్కూళ్లలో పూర్తయ్యాయి.  కేవలం 248 స్కూళ్లలో మాత్రమే వందశాతం పనులు పూర్తి చేయగలిగారు. ఇదిలా ఉం డగా జిల్లా సమ గ్రశిక్ష ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల ఇసుక కొరతతో పను లు ముందుకుసాగడం లేదు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం మత్తు వదిలి, కళ్లు తెరవకపోతే పనుల్లో మరింత జాప్యమయ్యే అవకాశమూ లేకపోలేదు.

Updated Date - 2020-08-10T08:00:57+05:30 IST