హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మొబైల్ సర్వీసులు డౌన్...
ABN , First Publish Date - 2021-06-15T20:51:33+05:30 IST
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సర్వీసుల్లో అంతరాయమేర్పడింది. మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులు డౌన్ అయ్యాయి.
హైదరాబాద్ : హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సర్వీసుల్లో అంతరాయమేర్పడింది. మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులు డౌన్ అయ్యాయి. దీంతో కస్టమర్లపై ప్రభావం పడింది. ట్విట్టర్ వేదికగా... హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కమ్యూనికేషన్ టీమ్ ఈ విషయాన్ని వెల్లడించింది. వివరాలిలా ఉన్నాయి.
‘మొబైల్ బ్యాంకింగ్ యాప్‌కు సంబంధించి సమస్యలు తలెత్తాయి. దీనిపై పని చేస్తున్నాం. ఖాతాదారులు... లావాదేవీల నిర్వహణ కోసం నెట్ బ్యాంకింగ్ ఉపయోగించాలి. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తాం’ అని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కమ్యూనికేషన్ బృందం ఈ సందర్భంగా వెల్లడించింది.