Abn logo
Jan 25 2021 @ 03:07AM

డేటింగ్ యాప్స్ వాడేవారికి.. ఇంటర్‌పోల్ హెచ్చరిక!

న్యూఢిల్లీ : ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లపై ఇంటర్‌పోల్ తాజాగా హెచ్చరిక జారీ చేసింది. ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లతో ప్రజలను మోసం చేశారని ఇంటర్‌పోల్ కు పలు దేశాల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో తాజాగా అంతర్జాతీయ పోలీసు సంస్థ తాజా హెచ్చరిక జారీ చేసింది. డేటింగ్ యాప్ ల సాయంతో ప్రజలను మోసగించే మోడస్ ఆపరేషన్ పై ఇంటర్ పోల్ ప్రజలను అప్రమత్తం చేసింది. 194 సభ్యదేశాలకు ఇంటర్ పోల్ ఈ హెచ్చరిక జారీ చేసింది. డేటింగ్ యాప్ వల్ల మీరు మీ బ్యాంకు ఖాతాలోని డబ్బు కోల్పోవచ్చని హెచ్చరించింది. 


డేటింగ్ అనువర్తనం ద్వారా వ్యక్తులతో పరిచయం పెంచుకొని, నమ్మకం ఏర్పడ్డాక ట్రేడింగ్ యాప్ డౌన్ లోడ్ చేసి బ్యాంకు లావాదేవీలు చేయమని కోరతారని, అప్పుడు మీ ఖాతాలోని డబ్బును కొల్లగొడతారని ఇంటర్ పోల్ వివరించింది. మోసపూరిత డేటింగ్ యాప్ లను ప్రజలు నమ్మవద్దని సూచించింది. 


ఈ జాగ్రత్తలు తీసుకోండి: 


  • మీకు తెలియని వ్యక్తి మిమ్మల్ని సంప్రదించినపుడు అప్రమత్తంగా ఉండాలి.
  • అద్భుతమైన రాబడి వాగ్ధానంతో ఆన్ లైన్ పెట్టుబడులు నిజం కావని గ్రహించాలి.
  • డబ్బును బదిలీ చేయడానికి ముందు రెండు సార్లు ఆలోచించండి. 
  • మీ వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయవద్దు. 

Advertisement
Advertisement
Advertisement