Rajasthanలో ఇంటర్నెట్ సేవల నిలిపివేత

ABN , First Publish Date - 2022-05-11T22:21:56+05:30 IST

Rajasthanలో ఇంటర్నెట్ సేవల నిలిపివేత

Rajasthanలో ఇంటర్నెట్ సేవల నిలిపివేత

భిల్వారా: యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ నేపథ్యంలో భిల్వారా నగరంలో అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రాజస్థాన్‌లోని భిల్వారా నగరంలో మరో వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు 20 ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి చంపారు. శాంతి భద్రతలను కాపాడేందుకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. మే 10న అర్థరాత్రి జరిగిన సంఘటనకు నిరసనగా వ్యాపారులు తమ దుకాణాలను మూసి ఉంచాలని రైట్‌వింగ్ గ్రూపులు పిలుపునిచ్చాయి. భిల్వారాలోని శాస్త్రి నగర్ నివాసి ఆదర్శ్ తాప్డియాపై మరో వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. గ్రూపుల సభ్యులు తాప్డియా మృతదేహాన్ని ఉంచిన మార్చురీ వెలుపల కూడా ప్రదర్శన నిర్వహించారు. ఈ కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితిని పరిశీలిస్తే శాంతిభద్రతలను నిర్వహించడానికి అదనపు పోలీసు సిబ్బందిని ఆ ప్రాంతంలో మోహరించారు. తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడానికి భిల్వారా నగరంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు.

Read more