యోగా.. భలేగా..

ABN , First Publish Date - 2022-06-22T13:59:40+05:30 IST

అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున నగరం ఆసనం వేసింది. విభిన్న భంగిమలతో యోగా ప్రేమికులు ఆకట్టుకున్నారు

యోగా.. భలేగా..

హైదరాబాద్‌ సిటీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున నగరం ఆసనం వేసింది. విభిన్న భంగిమలతో యోగా ప్రేమికులు ఆకట్టుకున్నారు. పరేడ్‌ గ్రౌండ్‌, మారేడ్‌పల్లిలోని క్రీడా మైదానం, సికింద్రాబాద్‌ రైల్వే స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, విద్యాలయాలు.. ఇలా అన్ని చోట్లా వేడుకగా కార్యక్రమాలు కొనసాగాయి. విద్యార్థులు, న్యాయవాదులు, వైద్యులు, రాజకీయ వేత్తలు, సెలబ్రెటీలు ప్రతి ఒక్కరూ ఆసనాలతో అబ్బురపరిచారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి యోగా ఎంతో సహకరిస్తుందని నిపుణులు వివరించారు. 

Updated Date - 2022-06-22T13:59:40+05:30 IST