ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

ABN , First Publish Date - 2021-06-22T06:33:09+05:30 IST

కనిగిరిలో 7వ అంతర్జాతీయ యోగా వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహిం చారు. పట్టణంలోని గురుస్వాత్మ రామ యోగా మందిరంలో యోగా గురువు స్వర్ణ రమణయ్య చిన్నారులతో వేయించిన యోగా ఆసనాలు అలరించాయి.

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
కనిగిరిలో యోగాసనాలు వేస్తున్న గురువు

కనిగిరి, జూన్‌ 21 : కనిగిరిలో 7వ అంతర్జాతీయ యోగా వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహిం చారు. పట్టణంలోని గురుస్వాత్మ రామ యోగా మందిరంలో యోగా గురువు స్వర్ణ రమణయ్య చిన్నారులతో వేయించిన యోగా ఆసనాలు అలరించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాసనాలు, యోగా విన్యాసాలు, ప్రాణాయామాలు, క్రియలు మనిషి కి ఎంతో ఆరోగ్యాన్నిస్తా యన్నారు. ఆయా విన్యాసాలను, కఠిన తరమైన ఆసనాలను కూడా విద్యార్థులు సంహిత, రేవంత్‌సాయి, యశస్విని ప్రదర్శించారు. యోగా గురువు స్వర్ణ రమణయ్య జలనేతి, సుత్రనేతి, కపాలభాతి వంటి క్రియలను ప్రదర్శించారు. 

సీఎస్‌పురం : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని  శీలంవారిపల్లి గ్రామంలోని కదిరి బాబూరావు వ్యవసాయ, ఉద్యానవన కళాశాలలో యోగా దినోత్సవ వేడుకలను సోమవారం ఘన ంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్‌ కదిరి పార్థసారథి కళాశాల సిబ్బందితో కలిసి యోగసనాలు వేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యోగాతో శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారన్నారు.

పామూరు : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి లభి స్తుందని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్‌ గద్దె ఏడుకొండలు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని పలువురు ప్రైవేటు డాక్టర్లు, యోగా కార్యకర్తలు యోగాసనాలను సోమవారం నిర్వహించారు. ఏడుకొండలు మాట్లాడుతూ అనునిత్యం ధ్యానం చేయడం వలన అనేక రుగ్మతలు తగ్గుతాయన్నారు.

Updated Date - 2021-06-22T06:33:09+05:30 IST