ఇంటర్నేషనల్‌ ఫోన్‌కాల్స్‌ లోకల్‌గా మార్పు

ABN , First Publish Date - 2022-06-23T17:37:13+05:30 IST

ఇంటర్నేషనల్‌ ఫోన్‌కాల్స్‌ను లోకల్‌ ఫోన్‌కాల్స్‌గా మార్చుకుని అక్రమాలకు పాల్పడుతున్న గుట్టును మిలిటరీ ఇంటెలిజెన్స్‌, సీసీబీ పోలీసులు

ఇంటర్నేషనల్‌ ఫోన్‌కాల్స్‌ లోకల్‌గా మార్పు

                                       - Kerala వాసి అరెస్టు 


బెంగళూరు, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఇంటర్నేషనల్‌ ఫోన్‌కాల్స్‌ను లోకల్‌ ఫోన్‌కాల్స్‌గా మార్చుకుని అక్రమాలకు పాల్పడుతున్న గుట్టును మిలిటరీ ఇంటెలిజెన్స్‌, సీసీబీ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ కాల్స్‌ను అనధికారికంగా సిమ్‌ బాక్సుల ద్వారా లోకల్‌గా మార్చుకునే ముఠాగా గుర్తించారు. ముఠా నుంచి 53 సిమ్‌బాక్సులు, 1940 సిమ్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు సీసీబీ పోలీసులు బుధవారం ప్రకటించారు. ముఠా సూత్రధారి కేరళ రాష్ట్రం వాయనాడ్‌కు చెందిన షరాపుద్దీన్‌ను అరెస్టు చేశామన్నారు. వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ (వీఓఐపీ) విధానంతో అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించామన్నారు. ఇతను నగరంలోని భువనేశ్వరినగర్‌ చిక్కసంద్ర సిద్దేశ్వర లే అవుట్‌లోపాటు నాలుగు ప్రాంతాలలో సిమ్‌ బాక్సులు ఉంచి అక్రమాలకు పాల్పడేవాడని వెల్లడించారు. దేశభద్రతకు ఇది ప్రమాదకరమని మిలిటరీ ఇంటెలిజెన్స్‌ వెల్లడించింది. 

Updated Date - 2022-06-23T17:37:13+05:30 IST