జూన్‌ 29, 2021 ఒలింపిక్స్‌ అర్హతకు గడువు

ABN , First Publish Date - 2020-04-04T09:34:45+05:30 IST

టోక్యో విశ్వ క్రీడలకు అర్హత పొందాల్సిన సమయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) శుక్రవారం ప్రకటించింది. 2021కి వాయిదా వేసిన ఈ క్రీడలకు అర్హత ...

జూన్‌ 29, 2021 ఒలింపిక్స్‌ అర్హతకు గడువు

లోసాన్‌: టోక్యో విశ్వ క్రీడలకు అర్హత పొందాల్సిన సమయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) శుక్రవారం ప్రకటించింది. 2021కి వాయిదా వేసిన ఈ క్రీడలకు అర్హత సాధించే గడువును వచ్చే ఏడాది జూన్‌ 29గా ఖరారు చేసింది. ఈమేరకు జాతీయ ఒలింపిక్‌ కమిటీలకు ఐఓసీ డైరెక్టర్‌ జేమ్స్‌ మెక్‌లియోడ్‌ సమాచారం పంపారు. అలాగే టోక్యో క్రీడలకు ఎంట్రీలను పంపేందుకు తేదీని జూలై 5, 2021గా ప్రకటించారు. 

Updated Date - 2020-04-04T09:34:45+05:30 IST