అంతర్జాతీయ నర్సుల దినోత్సవం.. మాస్కులు పంపిణీ

ABN , First Publish Date - 2021-05-12T21:04:41+05:30 IST

‘ఇంటర్నేషనల్ నర్స్ డే’ సందర్భంగా బంజారా మహిళా ఎన్‌జీవో ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం.. మాస్కులు పంపిణీ

హైదరాబాద్: ‘ఇంటర్నేషనల్ నర్స్ డే’ సందర్భంగా బంజారా మహిళా ఎన్‌జీవో ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. చింతల్ బస్తీలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ వర్కర్స్, అలాగే కోవిడ్ టీకాల కోసం వచ్చిన వారికి, వ్యాధి నిర్ధారణ కోసం వచ్చిన వారికి మాస్కులను ఉచితంగా అందజేసారు. డాక్టర్ ప్రశాంతి చేతుల మీదుగా పంపిణీ చేశారు. డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. నర్సులకు ఇంటర్నేషనల్ నర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. వైద్య రంగానికి నర్సులు వెన్నుముక అని, ముఖ్యంగా కరోనా కాలంలో వారు అందిస్తున్న సేవలు విలువైనవని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పరిమళ లక్ష్మి, స్నేహితులు కృష్ణ, విశాలి, దీప్తి, అనిక, అరుణకు ధన్యవాదాలు తెలిపారు.  

Updated Date - 2021-05-12T21:04:41+05:30 IST