ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా మాతృభాష దినోత్సవం!

ABN , First Publish Date - 2022-03-01T22:29:59+05:30 IST

ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య వారి ఆధ్వర్యంలో హాంగ్ కాంగ్ లో.. అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవం జరిగింది.

ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా మాతృభాష దినోత్సవం!

ది హాంకాంగ్  తెలుగు సమాఖ్య వారి ఆధ్వర్యంలో  అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవం ఘనంగా జరిగింది. హాంకాంగ్‌ వేదికగా జరిగిన కార్యక్రమానికి ఈ సంవత్సరం.. ఐక్యరాజ్యసమితి, యునెస్కో హాంగ్ కాంగ్ వారు, బంగ్లాదేశ్ సంఘం, బంగ్లాదేశ్ వాణిజ్యమండలి వారు తమ వంతు సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా Mrs. Mitzi Leung, Co-Chair, UNESCO Hong Kong Assn Glocal Peace Centre,Vice President - UNESCO Hkg Assn; Mr. Masud, President, Bangladesh Metropolitan Chamber of Commerce ; Mr. Mohiuddin, President - Bangladesh Association of Hong Kong మరియు Mr.Thirupathi Nachiappan, Co-Chair Community Engagement & Management, Committee Member, UNESCO Hong Kong Assn Glocal Peace Centre ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని ఈ సందర్భంగా ముఖ్య నిర్వాహకులు, ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు జయ పీసపాటి తెలిపారు. గతేడాది నుంచి ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య..ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 


కాగా..  భారతీయ భాషలు సంస్కృతం, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, పంజాబీ, ఒడియా మరియు విదేశీ భాషలు బాంగ్లా & అరబీ (బంగ్లాదేశ్), కజఖ్ (కజకస్తాన్), తజక్ (తజికిస్తాన్), కాంటోనీస్ (హాంగ్ కాంగ్) స్పానిష్ (కొలంబియా) భాషలలో ప్రాంతీయ ప్రతినిధులు మరియు గురువులు తమ విధ్యార్థుల భాషా ప్రతిభాపాటవాలను కవితలు, పాటలు, పద్యాలు, మరియు కథల ద్వారా ఆనందోత్సాహాల నడుమ ప్రదర్శించారు. ఐక్యరాజ్యసమితి, యునెస్కో కార్యవర్గ సభ్యులు తిరునాచ్ మాట్లాడుతూ..  జయ పీసపాటి ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారని, వచ్చే సంవత్సరం మరిన్ని దేశ భాషలను కలిపేందుకు ఆలోచిస్తున్నామని తెలిపారు.  తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు జయ.. కృతజ్ఞతా పత్రం సమర్పిస్తూ  సమాఖ్య కార్యవర్గ సభ్యులు రాజశేఖర్ మన్నే, సువర్ణ చుండూరు , రమాదేవి సారంగాకు, కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలను వారి తల్లి తండ్రులను, ప్రాంతీయ ప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న  ముఖ్య అతిథులకు,తమ కృతజ్ఞతలు తెలిపారు.


ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా మాతృభాష దినోత్సవంగా జరుపుకోవాలని యునెస్కో 1999 నవంబరు 17న ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవన వైవిధ్యాన్ని కాపాడుకోగలమని  ఐక్యరాజ్యసమితి, యునెస్కో చెబుతోంది. ఐక్యరాజ్యసమితి, యునెస్కో 1999 ఫిబ్రవరి 21 న అంతర్జాతీయ మాతృభాష దినంగా ప్రకటించింది. 2000 ఫిబ్రవరి 21 నుండి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. మాతృభాషకు ఉన్న ప్రాధాన్యతను వక్కాణిస్తూ "తల్లీ నొడికంటే పరమామృతంబు కలదే" అని మహాకవి రాయప్రోలు వారన్నారు. అలాగే  "మాతృ భాషా తృణీకారం అంటే మాతృదేవి తిరస్కారంతో సమానం" అని మహాత్మా గాంధీజీ అన్నారు. మాతృమూర్తి పై ,మాతృభూమిపై , మనసున్న ప్రతి మనిషికీ అవ్యజమైన ప్రేమ,గౌరవం ఉంటుంది. అందుకే " మాతృ దేవోభవః " అని జన్మనిచ్చిన తల్లికి మన తొలి వందనం సమర్పించుకుంటాం.తల్లి ఒడే, తొలి బడి.మనిషి జీవితంలో మొదట నేర్చుకున్నే భాష మాతృభాష. అందుకే  మాతృభాష సహజంగా అబ్బుతుంది.అప్రయత్నంగా వచ్చే భాష మాతృభాష. 


ఇప్పుడు ప్రపంచం ఒక కుగ్రామం కాగా, ఒకే కుటుంబం లో ఖండాంతరాలకు చెందిన వారు, భిన్నమైన మాతృ భాషలవారు కలిసి జీవిస్తున్నారు. అంటే ఆ ఇంట్లో వారు బహు భాషలలో సంభాషించగలరు. నేడు ప్రపంచంలో దాదాపు 6,500 భాషలు మాట్లాడుతున్నారు. వాటిలో ప్రతి ఒక్కటి ప్రపంచాన్ని వైవిధ్యభరితమైన మరియు అందమైన ప్రదేశంగా మారుస్తుంది. దురదృష్టవశాత్తు, ఈ భాషల్లో కొన్ని ఇతర భాషల కంటే తక్కువ విస్తృతంగా మాట్లాడబడుతున్నాయి. ప్రపంచంలోని భాషల యొక్క అత్యంత విస్తృతమైన కేటలాగ్, సాధారణంగా ఏదైనా అధికారికంగా పరిగణించబడుతుంది, ఇది ఎథ్నోలాగ్ (SIL ఇంటర్నేషనల్ ద్వారా ప్రచురించబడింది), దీని వివరణాత్మక వర్గీకృత జాబితా 2009 నాటికి 6,909 విభిన్న భాషలను కలిగి ఉంది.తల్లి భాషను నేర్చుకున్న వారు ఎన్ని భాషలైన అవలీలగా నేర్చుకోగలరని, మంచి తెలివితేటలు కలవారావుతారని భాష శాస్త్రవేత్తలు చెబుతారు. సుసంపన్నమైన మన భాషా సాహిత్య సౌందర్యాన్ని అవగాహన చేసుకోవడం,మన భాషను,సంస్కృతినీ కాపాడుకోవడం,భావి తరాల వారికి దీనిని అందించడం ఆ భాషా సౌందర్య సంపదను కాపాడటం మన అందరి కర్తవ్యం. 

Updated Date - 2022-03-01T22:29:59+05:30 IST