ట్రిపుల్‌ ఐటీలో అంతర్జాతీయ స్థాయి విద్యాబోధన

ABN , First Publish Date - 2022-08-07T06:13:15+05:30 IST

బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ఐటీలో అంతర్జాతీయ స్థాయి విద్యాబోధన జరుగుతుందని వైస్‌ చాన్సలర్‌ వెంకటరమణ చెప్పారు.

ట్రిపుల్‌ ఐటీలో అంతర్జాతీయ స్థాయి విద్యాబోధన
పలు కంపెనీలతో అవగాహన ఒప్పందాలను మార్చుకుంటున్న వీసీ

ప్రతి విద్యార్థి సమాజానికి ఉపయోగపడే అవిష్కరణ చేయాలి 

విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేలా కార్యక్రమాలు 

పలుసంస్థలతో ట్రిపుల్‌ ఐటీ అవగాహన ఒప్పందం 

ట్రిపుల్‌ ఐటీలో ఇన్నోవెట్‌ డే కార్యక్రమంలో వైస్‌ ఛాన్స్‌లర్‌ వెంకటరమణ వెల్లడి 

బాసర, ఆగస్టు 6 : బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ఐటీలో అంతర్జాతీయ స్థాయి విద్యాబోధన జరుగుతుందని వైస్‌ చాన్సలర్‌ వెంకటరమణ చెప్పారు. ఇందుకు ప్రతిసంవత్సరం విద్యార్థులు సాధిస్తున్న అంతర్జాతీయస్థాయి ఉద్యోగాలే నిదర్శన మని పేర్కొన్నారు. శనివారం ఇన్నోవేట్‌ డే కార్యక్ర మం జరిగింది. ఈ కార్య క్రమానికి పలు సంస్థల ప్రతినిధులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైస్‌ చాన్సలర్‌ వెంకటరమణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థుల్లో నెలకొన్న టాలెంట్‌ వెలికి తీసేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తు న్నట్లు తెలిపారు. ట్రిపుల్‌ ఐటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇన్నోవేషన్‌ అబ్‌ ఇంకుబేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం  యోచిస్తున్నట్లు తెలిపా రు. ప్రతి సంవత్సరం 500ల మంది వివిధ రంగాల్లో పేరొందిన నిపుణుల ఉప న్యాసాలను విద్యార్థులకు తెలిపేలా ప్రణాళిక చేస్తున్నట్లు సమాజానికి ఉపయోగ పడేలా విద్యార్థుల ఆవిష్కరణలు జరిపేందుకు ఇన్నోవేషన్‌ కార్యక్రమాలను చేపడు తున్నట్లు వివరించారు. విద్యార్థులకు చదువేకాదు యోగా, స్పోర్ట్స్‌ వంటి పోటీలను కూడా  నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి బ్రాంచ్‌ నుండి 10 మంది విద్యార్థులను ఎంపిక చేసి రాష్ట్రంలోని అగ్ర శ్రేణి పరిశ్రమలను పరిచయం చేయనున్నట్లు చెప్పా రు. విద్యార్థులు ప్రదర్శించిన తమ ఆవిష్కరణలను అతిథులకు వివరించారు. ఈ కార్యక్రమంలో బౌరోటెక్‌ సెల్యూషన్‌ పిపుల్‌ ఆపరేషన్‌ గ్లోబల్‌ లీడర్‌ అయిన డా. శైలజ, టీఎస్‌ఐసీ చీప్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌ శాంతా థౌతమ్‌, ప్రముఖులు తది తరులు పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో పలు కంపెనీలతో ట్రిపుల్‌ ఐటీ అవగాహన ఒప్పందాలను చేసుకుంది. టీఎస్‌ఐసీతో తర్వాత బౌర్‌టెక్‌ సొల్యూషన్‌ ఇండ్‌తో ఐటీఈసీ డిపార్టు మెంట్‌, కాకతీయ శాండ్‌బ్యాక్స్‌ సంస్థతో ట్రిపుల్‌ ఐటీ అవగాహన ఒప్పందం జరిగింది. ఈ సంస్థల ప్రతినిధులు ట్రిపుల్‌ ఐటీ అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.  

Updated Date - 2022-08-07T06:13:15+05:30 IST