అంతర్జాతీయ స్థాయిలో Bengaluru టెక్‌ సమ్మిట్‌

ABN , First Publish Date - 2022-04-26T16:24:46+05:30 IST

అంతర్జాతీయ స్థాయిలో ‘బెంగళూరు టెక్‌ సమ్మిట్‌’ నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై తెలిపారు. నవంబరులో జరిగే సమ్మిట్‌కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో Bengaluru టెక్‌ సమ్మిట్‌

                            - సీఎం బసవరాజ్‌ బొమ్మై


బెంగళూరు: అంతర్జాతీయ స్థాయిలో ‘బెంగళూరు టెక్‌ సమ్మిట్‌’ నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై తెలిపారు. నవంబరులో జరిగే సమ్మిట్‌కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నగరంలో సమ్మిట్‌ సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి బొమ్మై మాట్లాడుతూ బెంగళూరు టెక్‌ సమ్మిట్‌ ప్రారంభమై 24 ఏళ్లు పూ ర్తయిందని తెలిపారు. 25వ విడత అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తామన్నారు. ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీలు, స్టార్టప్ ల సీఈఓలను భాగస్వామ్యులు చేస్తామన్నారు. బెంగళూరును ప్రపంచంలోనే నంబర్‌వన్‌ సిలికాన్‌ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. ఇదే సందర్భంగా రాష్ట్ర ఐటీబీటీ శాఖ మంత్రి డాక్టర్‌ అశ్వత్థనారాయణ మాట్లాడుతూ టెక్‌ సమ్మిట్‌ సిల్వర్‌ జూబ్లీ జరుపుకుంటున్న తరుణంలో పరిశోధనలు, ఆవిష్కరణలు, క్లస్టర్ల సృష్టితో పాటు కట్టింగ్‌ ఎడ్జ్‌ పరిశోధనలకు ప్రాధాన్యత ఇస్తామని వివరించారు. సమ్మిట్‌ నవంబరు 16 నుంచి 18దాకా ప్యాలెస్ లో జరుగుతుందని పేర్కొన్నారు. గడిచిన కొవిడ్‌ కారణంగా వర్చువల్‌ రూపంలో సాగిందని భౌతికంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పీఎం మోదీని మోదీని ప్రారంభానికి ఆహ్వానిస్తామన్నారు. ఐటీ విజన్‌గ్రూపు చైర్మన్‌ క్రిష్‌ గోపాలక్రిష్ణ, బయోటెక్నాలజీ విజన్‌గ్రూపు చైర్మన్‌ కిరణ్‌ మజుందార్‌షా, స్టార్టప్‌ విభాగం చైర్మన్‌ ప్రశాంత్‌ ప్రకాష్‌, ఐటీబీటీ విభాగం కార్యదర్శి రమణారెడ్డి, ఏబీఎల్‌ఈ అధ్యక్షుడు జీఎస్‌ క్రిష్ణన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-04-26T16:24:46+05:30 IST