Abn logo
Sep 21 2021 @ 01:09AM

అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు సెయింట్‌ ఆన్స్‌ విద్యార్థి

విద్యార్థిని అభినందిస్తున్న కరస్పాండెంట్‌, ప్రిన్సిపాల్‌

తిరువూరు, సెప్టెంబరు 20:  అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు పట్టణంలోని సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌ విద్యార్థి డి.జస్వంత్‌ ఎంపికయ్యాడు. సోమవారం స్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జస్వంత్‌ను కరస్పాండెంట్‌ సిస్టర్‌ జోత్న, ప్రిన్సిపాల్‌ సిస్టర్‌ కుసుమ అభినందించారు. ఈనెల 3, 4, 5, తేదీల్లో జైపూర్‌లో నిర్వహించిన జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి అండర్‌-14 విభాగంలో అక్టోబర్‌లో నేపాల్‌లో నిర్వహించే అంతర్జాతీయ కబడ్డీపోటీలకు ఎంపికయ్యాడు. పీఈటీ రామ్మోహన్‌, శ్రీనివాస్‌, సిబ్బంది అభినందించారు.