ఫిబ్రవరి 28 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు

ABN , First Publish Date - 2022-01-20T09:10:36+05:30 IST

ఫిబ్రవరి 28 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు

ఫిబ్రవరి 28 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు

న్యూఢిల్లీ, జనవరి 19: షెడ్యూల్డ్‌ అంతర్జాతీయ ప్యాసింజర్‌ విమానాలపై రద్దును డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. భారత్‌ నుంచి వెళ్లే, భారత్‌కు వచ్చే అన్ని షెడ్యూల్డ్‌ అంతర్జాతీయ ప్యాసింజర్‌ విమానాలపై ఉన్న రద్దును ఫిబ్రవరి 28 వరకు పొడిగించాలని నిర్ణయించామని డీజీసీఏ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లు, తాను  ప్రత్యేకంగా ఆమోదించిన ఫ్లైట్లకు ఈ ఆంక్షలు వర్తించవని డీజీసీఏ తెలిపింది. అలాగే ‘ఎయిర్‌ బబుల్‌’ పరిధిలో ఉన్న విమానాలకూ ఈ ఆంక్షలు వర్తించవని వెల్లడించింది. కాగా కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020 మార్చి 23 నుంచి దేశంలో షెడ్యూల్డ్‌ అంతర్జాతీయ ప్యాసింజర్‌ విమానాల సేవలపై సస్పెన్షన్‌ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే భారత్‌, ఇతర 40 దేశాల మధ్య ప్రత్యేక ప్యాసింజర్‌ విమానాలను నడుపుతున్నారు.

Updated Date - 2022-01-20T09:10:36+05:30 IST