ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

ABN , First Publish Date - 2021-06-22T07:16:00+05:30 IST

ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సోమవారం పలు సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యోగాసానలను ప్రదర్శించారు. జీవితంలో యోగా ఆవశ్యకతను, విశిష్టతను గురించి తెలియజేశారు. ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో స్థానిక యూటీఎఫ్‌ హాలులో సోమవారం ఉదయం జరిగిన వేడుకలలో ఆ శాఖ ప్రాంతీయ ఉపసంచాలకులు డాక్టర్‌ జి.పద్మజా, జిల్లా అధికారి డాక్టర్‌ బి.జనార్దనరావులు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
జేసీఐ ఆధ్వర్యంలో యోగా చేస్తున్న దృశ్యం

ఒంగోలు(కల్చరల్‌), జూన్‌ 21: ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సోమవారం పలు సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా పలువురు యోగాసానలను ప్రదర్శించారు. జీవితంలో యోగా ఆవశ్యకతను, విశిష్టతను గురించి తెలియజేశారు. ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో స్థానిక యూటీఎఫ్‌ హాలులో సోమవారం ఉదయం జరిగిన  వేడుకలలో ఆ శాఖ ప్రాంతీయ ఉపసంచాలకులు డాక్టర్‌ జి.పద్మజా, జిల్లా అధికారి డాక్టర్‌ బి.జనార్దనరావులు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. జూనియర్‌ చాంబర్‌ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో పతంజలి యోగ, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఒంగోలు సిటిజన్స్‌, ఒంగోలు ఫ్రండ్స్‌ క్లబ్‌ల సంయుక్త నిర్వహణలో స్థానిక సీతారాంపురంలోని ఆర్యవైశ్య బాయ్స్‌ హాస్టల్‌లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.  పతంజలి యోగా రాష్ట్ర అధ్యక్షుడు జి.బాలసుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా యోగాభ్యాసకులతో పలు యోగాసనాలను ప్రదర్శింపజేశారు. జేసీఐ అధ్యక్షుడు డాక్టర్‌ బెజవాడ శ్రీపవన్‌కుమార్‌, కార్యదర్శి డాక్టర్‌ లంకా ప్రసన్నకుమార్‌, తాతా బదరినాథ్‌  పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనూ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.  స్థానిక రైల్వే స్టేషన్‌ రోడ్‌లో ఉపాస సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి సహకారంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శెగ్గెం శ్రీనివాస రావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. అలాగే  వివేకానంద హఠయోగ కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక యూటిఎఫ్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి డి.వీరాంజనేయులు, అధ్యక్షుడు ఏ.రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌, యోగ మిత్రమండలి సంయుక్త నిర్వహణలో స్థానిక సిద్ధా పిరమిడ్‌ ధ్యాన కేంద్రంలో యోగా దినోత్సవం సందర్భంగా కేక్‌ కట్‌చేసి వేడుకలను నిర్వహించారు.  పిరమిడ్‌ స్పిరిచ్యువల్‌ మూవ్‌మెంట్‌ జిల్లా అధ్యక్షుడు సిద్ధా సూర్యప్రకాశ రావును ఘనంగా సత్కరించారు.  ఈ సందర్భంగా రెడ్‌క్రాస్‌ రాష్ట్ర కోశాధికారి డాక్టర్‌ సి.వెంకటేశ్వర రెడ్డి, డి.వి.రాఘవ, ఇక్బాల్‌, ప్రసన్నరాజు తదితరులు పాల్గొన్నారు.  

క్విస్‌లో..

ఒంగోలువిద్య : స్థానిక  క్విస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో అంతర్జాతీయ యోగాదినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించినట్లు క్విస్‌ విద్యాసంస్ధల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ నిడమానూరి సూర్యకళ్యాణ చక్రవర్తి, అధ్యక్షుడు నిడమానూరి  నాగేశ్వరరావు తెలిపారు. కళాశాల ఎన్‌ఎ్‌సఎ్‌స విభాగం ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం అధ్వర్యంలో యోగా శిక్షణా తరగతులు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీవీ సుబ్బారావు, ఎన్‌ఎ్‌సఎ్‌స డైరెక్టర్‌ వాసుబాబు ఈకార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

ఒంగోలు త్రిబుల్‌ఐటీలో 

  ఒంగోలు త్రిబుల్‌ఐటీ క్యాంప్‌సలో డైరెక్టర్‌ ఆచార్య డి.జయరామిరెడ్డి అధ్యక్షతన యోగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా అధికారులు అర్చన,. చంద్రశేఖర్‌ , పి.డి. భాస్కర్‌ ,ఆధ్యాపకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T07:16:00+05:30 IST