ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2021-10-26T03:30:59+05:30 IST

జిల్లాలో సోమవారం ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభ మైనట్లు ఇంటర్మీడియట్‌ విద్యాధికారి శ్రీధర్‌ సుమన్‌ తెలిపారు. మొదటి రోజు తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ, ఒకేషనల్‌ జీఎఫ్‌సీ సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించామన్నారు.

ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్‌ పరీక్షలు
ఆసిఫాబాద్‌లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు

ఆసిఫాబాద్‌ రూరల్‌, అక్టోబరు 25: జిల్లాలో సోమవారం ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభ మైనట్లు ఇంటర్మీడియట్‌ విద్యాధికారి శ్రీధర్‌ సుమన్‌ తెలిపారు. మొదటి రోజు తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ, ఒకేషనల్‌ జీఎఫ్‌సీ సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించామన్నారు. జన రల్‌లో4326, ఒకేషనల్‌లో882 మంది మొత్తం 5208మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉం డగా 457మంది గైర్హాజరయ్యారు. 4751 మంది హాజరైనట్లు తెలిపారు. కోవిడ్‌ నిబంధ నల మేరకు మాస్కులు ధరించడం, శాని టైజర్‌వాడకాన్ని తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేస్తూ విద్యార్థుల హాల్‌టికెట్లు పరిశీలించి పరీక్షా కేంద్రాలకు అనుమతించినట్లు ఆయన పేర్కొ న్నారు. పలు పరీక్షా కేంద్రాలను జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు శంకర్‌, తిరుపతి, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలు పరిశీలిం చినట్లు తెలిపారు. 

కెరమెరి: కెరమెరి మండలంలో 158మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా ఐదుగురు గైర్హాజరై నట్లు ప్రిన్సిపాల్‌ పర్శరాం తెలిపారు. 

తిర్యాణి: తిర్యాణిలో మండలంలో 156 మంది విద్యార్థులకు గాను 18 గైర్హాజరు అయినట్లు ప్రిన్సిపాల్‌ తెలిపారు. 

దహెగాం: దహె గాం మండలంలో 191 మంది హాజరు కావాల్సి ఉండగా 30మంది గైర్హాజరైనట్లు సీఎస్‌ అమరేందర్‌, అశోక్‌ తెలిపారు. 

కౌటాల: కౌటాల మండలంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 229మందికి గాను 206, జడ్పీఎస్‌ఎస్‌ పాఠశాల కేంద్రంలో 202 మందికిగాను 175మంది హాజరయినట్లు సీఐ రమేష్‌, డిపార్టుమెంట్‌ అధికారులు సునీత, జ్ఞానేశ్వర్‌ తెలిపారు. పరీక్షాకేంద్రాలను తహసీ ల్దార్‌ రాంలాల్‌, పీఎస్సైమనోహర్‌ సంద ర్శించారు. 

బెజ్జూరు: బెజ్జూరు మండలంలో మొత్తం 271మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 35మంది గైర్హాజరు అయినట్లు చీఫ్‌ సూపరింటెండెంట్‌ రాజయ్య తెలిపారు. 

కాగజ్‌నగర్‌: పట్టణంలో ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలను నిర్వహించారు.

Updated Date - 2021-10-26T03:30:59+05:30 IST