322 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే..!
ABN , First Publish Date - 2021-12-17T17:17:47+05:30 IST
ఇంటర్ విద్యార్హతతో..
Indian Coast Guardలో 322 పోస్టులు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్, ఆర్మ్డ్ ఫోర్సెస్‌ల్లో కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టులు- ఖాళీలు
నేవిక్(జనరల్ డ్యూటీ): 260
నేవిక్(డొమెస్టిక్ బ్రాంచ్): 35
యాంత్రిక్(మెకానికల్): 13
యాంత్రిక్(ఎలక్ట్రికల్): 09
యాంత్రిక్(ఎలక్ట్రానిక్స్): 05
అర్హత, వయసు:
నేవిక్(జనరల్ డ్యూటీ): మేథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
వయసు: 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. 2000 ఆగస్టు 1 నుంచి 2004 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి.
నేవిక్(డొమెస్టిక్ బ్రాంచ్): గుర్తింపు పొంది ఎడ్యుకేషనల్ బోర్డుల నుంచి పదోతరగతి ఉత్తీర్ణత
వయసు: 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. 2000 అక్టోబరు 1 నుంచి 2004 సెప్టెంబరు 30 మధ్య జన్మించి ఉండాలి
యాంత్రిక్: గుర్తింపు పొందిన ఎడ్యుకేషనల్ బోర్డుల నుంచి పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్(రేడియో/పవర్)ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత - ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయోపరిమితి నిబంధనలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: వివిధ దశల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో భాగంగా సెక్షన్-1, 2, 3, 4, 5 పరీక్షలు నిర్వహిస్తారు. ఏ పోస్టులకు ఏ సెక్షన్ పరీక్షను నిర్వహిస్తారు, దానిలో సాధించాల్సిన ఉత్తీర్ణత మార్కు లు, సంబంధిత సబ్జెక్టుల సిలబస్, పరీక్ష సమయం, అడిగే ప్రశ్నలు తదితర పూర్తి సమాచారం నోటిఫికేషన్లో ఇచ్చారు.
స్టేజ్-2: మొదటి దశలో నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్‌లో కనబరచిన ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేస్తారు. దీని ప్రకారం స్టేజ్-2కి ఎంపిక చేస్తారు. ఇందులో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రీ అసె్‌సమెంట్ టెస్ట్, తొలి మెడికల్ టెస్ట్ ఉంటాయి.
స్టేజ్-3: స్టేజ్-1, స్టేజ్-2లో కనబరచిన ప్రతిభ ఆధారంగా స్టేజ్-3కి ఎంపిక చేస్తారు. ఇందులో ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెడికల్ టెస్ట్, పోలీస్ వెరిఫికేషన్ ఉంటాయి.
స్టేజ్-4: ఇందులో వివిధ ఎడ్యుకేషన్ బోర్డులు/యూనివర్సిటీలు/రాష్ట్ర ప్రభుత్వ నుంచి పొందిన ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ ముందు ఉంచాలి. సర్టిఫికెట్లు ఒకవేళ జన్యూన్‌గా లేకపోతే టర్మినేట్ చేస్తారు.
ముఖ్యసమాచారం
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.250(ఎస్సీ/ఎస్టీలకు ఫీజు లేదు)
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 04
చివరి తేదీ: జనవరి 14
వెబ్సైట్: joinindiancoastguard.cdac.in/