‘రైలుబోగీలు ఇక్కడే తనిఖీ చేసుకోవచ్చు’

ABN , First Publish Date - 2020-02-20T07:45:28+05:30 IST

ఇంటర్మీడియట్‌ కోచ్‌ ఓవర్‌హాలింగ్‌ డిపోతో గుంటూరు రైల్వే డివిజన్‌కు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఆర్‌. మోహన్‌రాజా తెలిపారు.

‘రైలుబోగీలు ఇక్కడే తనిఖీ చేసుకోవచ్చు’

గుంటూరు, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ కోచ్‌ ఓవర్‌హాలింగ్‌ డిపోతో గుంటూరు రైల్వే డివిజన్‌కు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఆర్‌. మోహన్‌రాజా తెలిపారు. బుధవారం నెహ్రూనగర్‌ వద్ద నూతనంగా నిర్మించిన ఈ డిపోని డీఆర్‌ఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతం లో గుంటూరు డివిజ న్‌కు సంబంధించి ఏ రైలు బోగీ అయినా తని ఖీకోసం విజయ వాడకు పంపించాల్సి వచ్చేదన్నారు. దీని వల్ల అవి ఇన్‌స్పెక్షన్‌ పూర్తయి వచ్చేసరికి ఆలస్యమ య్యేదని తెలిపారు. ఇప్పుడు గుంటూరు డివిజన్‌లోనే ఇంటర్మీడియట్‌ కోచ్‌ ఓవర్‌హాలింగ్‌ డిపో నిర్మించినందున మన డివిజన్‌ రైళ్ల బోగీలన్ని ఇక్కడే తనిఖీచేసుకొని రైళ్లకు త్వరితగ తిన వాటిని జోడించవచ్చన్నారు.  కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం ఆర్‌.శ్రీనివాస్‌, రామామెహర్‌, సీనియర్‌ డీసీఎం డి.నరేంద్ర వర్మ, ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. 

గుంటూరు మీదుగా నాలుగు ప్రత్యేక రైళ్లు

మహాశివరాత్రి రద్దీదృష్ట్యా గుంటూరు మీదుగా నాలుగు ప్రత్యేకరైళ్లను రైల్వేశాఖ నడపబోతున్నట్లు ప్రకటించింది. నెంబరు. 07053 సికింద్రాబాద్‌-కాకినాడ టౌన్‌ ప్రత్యేకరైలు గురువారం సాయంత్రం 6.05 గంటలకు బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల మీదుగా గుంటూరుకు వచ్చి శుక్రవారం వేకువజామున 5.10గంటలకు కాకినాడటౌన్‌ చేరుకొంటుంది. నెంబరు. 07054కాకినాడ టౌన్‌- సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు ఈ నెల 23వ తేదీన రాత్రి 7 గంటలకు బయలుదేరి గుంటూరు, పిడుగురాళ్ల మీదుగా మరుసటి రోజు ఉదయం 8.25 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకొంటుంది. నెంబరు. 07429 తిరుపతి - సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు ఈ నెల 20వ తేదీ రాత్రి 7.25 గంటలకు బయలుదేరి పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల మీదుగా మరుసటి రోజు ఉదయం 8.45 గంటలకు తిరుపతి చేరుకొంటుంది. నెంబరు. 07430 తిరుపతి- సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు ఈ నెల 23వ తేదీ రాత్రి 7.30 గంటలకు బయలుదేరి గుంటూరు మీదుగా మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకొంటుంది. ఈ రైళ్లలో ఏసీ టూటైర్‌, త్రీటైర్‌ ఏసీ ఛైర్‌కార్‌, స్లీపర్‌క్లాస్‌ బోగీలుంటాయి.

Updated Date - 2020-02-20T07:45:28+05:30 IST