Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘ఎయిర్‌పోర్టు’ పరిహారంలో మధ్యవర్తుల దందా..!

  భోగాపురం, జనవరి 14: భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు భూ పరిహారంలో మధ్యవర్తుల చేతివాటంలో ఓ రైతు రూ.20 లక్షలు నష్టపోయా డు. దీంతో పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టగా, ఆశ్చర్య కరమైన విషయాలు వెలుగు చూశాయి. వివరాలిలా ఉన్నాయి. దిబ్బలపాలెంకు చెందిన కొయ్య గురుమూర్తి అనే రైతు ఎయిర్‌పోర్టుకు గతంలో స్థలం ఇచ్చారు. ఈమేరకు ప్రభుత్వం రైతుకు పరిహారంగా ఎకరా 72సెట్లకుగాను బ్యాంకు ఖాతాలో రూ.48.16 లక్షలు జమ చేసింది. అయితే మధ్యవర్తి అయిన చేపలకంచేరు గ్రామా నికి చెందిన అరజర్ల నర్సు ఆ రైతు నుంచి గతంలో చెక్కుపై సంతం చేయించాడు. అలాగే తన వద్ద పెట్టుకున్న చెక్కును ఉపయోగించి రైతుకు తెలియకుండా అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.20లక్షలు కాజేశాడు. ఈ మేరకు రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎస్‌ఐ యు.మహేష్‌ కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారం భించారు. అరజర్ల నర్సును గురువారం విచారించారు. మధ్యవర్తి రూ.20లక్షలు తీసుకొని, వాటిలో సుమారు రూ.4లక్షలు వాడుకొని, రూ.11.25లక్షలు ఓ వీఆర్వో బంధువుకు అందజేసినట్టు దర్యాప్తులో తేలినట్టు సమాచారం. ఫ దీనిపై ఎస్‌ఐ యు.మహేష్‌ను వివరణ కోరగా బాధిత రైతుకు తెలియకుండా మధ్యవర్తి రూ.20 లక్షలు తీసుకోవడంపై దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు. ఇంకా విచారణ చేయ వలసి ఉందని, విచారణ అనంతరం పూర్తి సమాచారం తెలియజేస్తామన్నారు.

Advertisement
Advertisement