గ్యాస్‌తో చెలగాటం..
ABN , First Publish Date - 2020-08-12T09:31:46+05:30 IST
గ్యాస్‌తో చెలగాటం.. ప్రజలకు ప్రాణ సంకటం అంటే ఇదేనని అనక మానదు. బైరెడ్డి
బైరెడ్డిపల్లె వాసులకు ప్రాణసంకటం
హోటల్ మూసివేయించిన అధికారులు
బైరెడ్డిపల్లె: గ్యాస్‌తో చెలగాటం.. ప్రజలకు ప్రాణ సంకటం అంటే ఇదేనని అనక మానదు. బైరెడ్డి పల్లె నాలుగు రోడ్ల కూడలిలో ఉండే ఓ హోటల్ నిర్వాహకుల తీరు అచ్చం ఇలాగే ఉంది. మంగళవారం వంట చేయడానికి విని యోగించే సిలిండర్‌ను స్టవ్‌మీద ఉంచి వేడి చేయడమే ప్రజల ఆందో ళనకు కారణం.
హోటల్ నిర్వాహకుడిని ప్రశ్నిస్తే ఇలా వేడి చేస్తే అడుగున ఉన్న గ్యాస్ పైకి వస్తుందని తెలిపారు. అయితే అది ప్రమాదమని కొందరు హెచ్చరించినా పట్టించుకోలేదు. దీంతో వారు పోలీసులకు, ఏజెన్సీ వారికి, పంచాయతీ అధికారులకు తెలియజేశారు. వారు వచ్చి హోటల్‌ను మూసివేయించారు. మరోసారి ఇలా చేస్తే చర్యలు తప్ప వని తహసీల్దార్ రమణి హెచ్చరించారు.