మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా, బాబీ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. Mega 154 వర్కింగ్ టైటిల్‌గా రూపొందుతోన్న ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాణం జరుపుకుంటోంది. చిరంజీవి సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ (waltair veerayya) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను రిజిస్టర్ చేశారు. వాల్తేరు సముద్రతీరం బ్యాక్ డ్రాప్లో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు బాబీ. ఇందులో చిరు అండర్ కవర్ కాప్ గా నటిస్తున్నట్టు ఇదివరకే వార్తలొచ్చాయి. ఇక ఇందులో రవితేజ (Raviteja) కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయనప్పటికీ.. ఆయన నటించడం ఖాయం అని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలోని రవితేజ పాత్ర గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Mega 154లో రవితేజ చిరుకి తమ్ముడిగానూ, ఆయన అనుచరుడిగానూ నటిస్తున్నాడట. ఇంటర్వెల్లో వచ్చే సీక్వెన్స్‌లో రవితేజ (Raviteja) పాత్ర రివీల్ అవుతుందట. ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందట. రవితేజ పాత్ర చనిపోవడంతో.. చిరులో మార్పు వస్తుందట. త్వరలోనే Mega 154లో రవితేజ పాత్రకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది.
‘ముఠామేస్త్రి’ తర్వాత ఆ తరహా సాగే మాస్ పాత్రను మళ్ళీ ఇందులోనే నటిస్తున్నారు చిరు. ఇందులోని ఆయన పాత్ర అభిమానుల్ని మెప్పిస్తుందని నిర్మాతలు చెబుతున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్దంలో Mega 154 చిత్రం విడుదల కాబోతోంది. ‘అన్నయ్య’ తర్వాత మళ్ళీ చిరంజీవి, రవితేజ కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో Mega 154పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా రవితేజకు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.