YCP సమావేశంలో Minister Botsa ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-05-08T23:49:40+05:30 IST

YCP సమావేశంలో Minister Botsa ఆసక్తికర వ్యాఖ్యలు

YCP సమావేశంలో Minister Botsa ఆసక్తికర వ్యాఖ్యలు

విజయనగరం:YCP సమావేశంలో Minister Botsa సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పలువురు వైసీపీ నేతలు సమావేశానికి డుమ్మా కొట్టారు. పదవి పొందిన భార్య స్థానంలో భర్త హాజరు సిగ్గుచేటు అని మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఇలా జరిగితే ఉపేక్షించేది లేదని మంత్రి బొత్స హెచ్చరించారు. రానున్న రెండేళ్లే కష్టపడితే మరో ఐదేళ్లు మనవే అని మంత్రి బొత్స తెలిపారు. మంత్రులకు సచివాలయాలుంటే.. జిల్లాల్లో ఉన్న సచివాలయాలన్నీ ఎమ్మెల్యేలవే అని మంత్రి బొత్స స్పష్టం చేశారు.


ఇటీవల తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నేతలకు జగన్ 2024 ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. 2024  అసెంబ్లీలో ఎన్నికల్లో 175 స్థానాలకుగాను 175 ఎందుకు రాకూడదని సమావేశంలో జగన్ అన్నారు. పార్టీ బాగుంటేనే మనం బాగుంటామని, పార్టీనే సుప్రీం అని జగన్ తెలిపారు. పార్టీ పరంగా నిరంతరం దృష్టి, ధ్యాస ఉండాలి. ఇదే విషయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదట్లోనే చెప్పా. ఈ మూడేళ్లలో మనం ఏం చేశామన్నది ప్రజల్లోకి వెళ్లి చెప్పే కార్యక్రమానికి ఇప్పుడు శ్రీకారం చుడుతున్నాం’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలను, జిల్లా అధ్యక్షులను నియమించామని, జిల్లాల ఇన్‌చార్జి మంత్రులను కూడా భాగస్వాములను చేశామని.. వీరందరినీ మంత్రులు గౌరవించాలని చెప్పారు. మనమంతా ఒకటే పార్టీ, ఒకటే కుటుంబం అని.. అందరూ కలసికట్టుగా పని చేయాలని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుల్ని జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్లుగా నియమించి కేబినెట్‌ హోదా కల్పిస్తున్నామని, త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల అవుతాయని తెలిపారు.

Read more