యూపీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర చిత్రం...ఐదేళ్ల తర్వాత కలిసిన ముగ్గురు నేతలు

ABN , First Publish Date - 2022-02-18T13:38:37+05:30 IST

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో ఆసక్తికర చిత్రం తాజాగా వెలుగుచూసింది...

యూపీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర చిత్రం...ఐదేళ్ల తర్వాత కలిసిన ముగ్గురు నేతలు

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో ఆసక్తికర చిత్రం తాజాగా వెలుగుచూసింది. యూపీలోని ఇటావా పట్టణంలో సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల ప్రచారంలో ముగ్గురు కీలక నేతలు కలిశారు.సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, అతని తండ్రి ములాయం సింగ్ యాదవ్ అతని మామ శివపాల్ సింగ్ యాదవ్ ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారి ఎన్నికల ప్రచారంలో కలిసి కనిపించారు.2016వ సంవత్సరం అక్టోబరులో సమాజ్‌వాదీ వికాస్ రథాన్ని ప్రారంభించినపుడు ముగ్గురు నేతలు కలిసి ప్రచారం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధినేత ములాయం సింగ్ యాదవ్ తన తనయుడు అఖిలేష్ యాదవ్‌కు ఓట్లు వేయాలని కోరారు. తమ పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు.


 పేదరికం, నిరుద్యోగ సమస్యలు పరిష్కారం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఈ సమస్యలపై తమ పార్టీ విధానాలు చాలా స్పష్టంగా ఉన్నాయని యాదవ్ అన్నారు.ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను గెలిపించాలని ములాయం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మూడో దశ పోలింగ్ ఫిబ్రవరి 20న కర్హాల్‌లో జరగనుంది. ఇక్కడ అఖిలేష్ యాదవ్‌పై కేంద్ర మంత్రి ఎస్‌పి సింగ్ బఘేల్‌ను బీజేపీ నిలబెట్టింది. యాదృచ్ఛికంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా మూడు కిలోమీటర్ల దూరంలో ఎన్నికల ర్యాలీలో దాదాపు ఏకకాలంలో బఘెల్‌తో కలిసి ప్రచారం చేశారు. ఎస్పీ కోటలో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన షా ప్రముఖ నేత ములాయం సింగ్ యాదవ్‌ను ప్రచారానికి తీసుకొచ్చినందుకు పార్టీపై విమర్శలు గుప్పించారు.శివపాల్ యాదవ్ కూడా తన మేనల్లుడితో కలిసి ప్రచారంలో కనిపించారు.


Updated Date - 2022-02-18T13:38:37+05:30 IST