8 ఎందుకు? మాకు 4 చాలు!

ABN , First Publish Date - 2020-03-15T01:16:47+05:30 IST

పిక్చర్‌ క్వాలిటీ గురించి చెప్పాలంటే రిజల్యూషన్‌ గురించి తెలుసుకోవాల్సిందే!

8 ఎందుకు? మాకు 4 చాలు!

పిక్చర్‌ క్వాలిటీ గురించి చెప్పాలంటే రిజల్యూషన్‌ గురించి తెలుసుకోవాల్సిందే! హెచ్‌డీ వచ్చి ఎంతో కాలమైనా - ఇప్పటికీ మామూలు టీవీలు వాడుతున్నవాళ్లు్న్నారు.  హెచ్‌డీ లో కూడా ఫుల్‌ హెచ్‌డీ, హెచ్‌డీ రెడీ అనే రెండు క్వాలిటీలు కనిపిస్తాయి. 1080 పిక్సెల్స్‌ క్వాలిటీ ఇచ్చేవి హెచ్‌డీ టీవీలయితే - మామూలు రిజల్యూషన్‌లో ఉన్న సీన్స్‌ని హెచ్‌డీలోకి స్కేల్‌ చేసి చూపించేవి హెచ్‌డీ రెడీ టీవీలు.


హెచ్‌డీ తరవాత దానికి రెట్టింపు అనదగిన 2K రిజల్యూషన్‌ వచ్చింది. అటుపైన 4K రిజల్యూషన్‌ టీవీలూ వచ్చాయి. ఈ రిజల్యూషన్‌ని అల్ట్రా హెచ్‌డీ అని అంటారు.  అయితే ఇలా రిజల్యూషన్‌ ఎంతగా పెంచుకుంటూ పోయినా - టీవీ ప్రసారాలు మాత్రం ఆ స్థాయి క్వాలిటీతో రావడం లేదు. 2K టీవీ ఛానెల్స్‌ ఉన్నాయి కానీ, అల్ట్రా హెచ్‌డీ ఛానెల్స్‌ ఇప్పటికీ తక్కువే!  


అయితే ఇప్పుడు మరింత ముందుకి పోయి 8k టీవీలు కూడా వచ్చాయి. 7,680x4,320 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ కలిగి ఉండే ఈ 8k టీవీలు - అద్భుతమైన పిక్చర్‌ క్వాలిటీ అందించినప్పటికీ - వీటికి సరిపడేంత క్వాలిటీ ఇచ్చే పూర్తి స్థాయి టీవీ ఛానెల్స్‌ ప్రపంచంలో ఎక్కడా లేవు. టీవీ ఎంత గొప్పదయినా - అసలు ఛానెల్స్‌ అంటూ ఉంటేనే కదా? - ఆ క్వాలిటీని ఎంజాయ్‌ చేయగలిగేది? అయితే 2018లో తొలిసారిగా ఒక టీవీ ఛానెల్‌ 8k క్వాలిటీ ప్రసారాల్ని అందించడం మొదలుపెట్టింది. ఆ ఛానెల్‌ పేరు NHK. జపాన్‌ లో ఉన్న ఈ ఛానెల్‌ రోజూ 12 గంటలపాటు 8K క్వాలిటీ ప్రసారాలు అందిస్తుంది.


తరవాత అక్కడక్కడ కొన్ని 8K టీవీ ఛానల్స్‌ వచ్చాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో పెద్ద పెద్ద బ్రాండ్‌లవాళ్లు ఒకటి రెండు 8K టీవీల్ని రిలీజ్‌ చేస్తున్నప్పటికీ - రిలీజ్‌ అయ్యేవాటిలో అధికభాగం 4K టీవీలే కావడం విశేషం!


ఉదాహరణకి ఈ ఏడాది ప్రముఖ బ్రాండ్‌ Sony విడుదల చేసిన టీవీల్లో ముఖ్యమైన మోడల్స్‌ ఇవీ :

Sony ZH8, A8, A85, A9,XH95,XH90 / XH92,XH85,XH81,XH80,XH70XH85

ఇందులో మొదట ఉన్న ZH8 ఒక్కటే 8K టీవీ. మిగిలినవన్నీ 4K రిజల్యూషన్‌ మాత్రమే సపోర్ట్‌ చేస్తాయి.

టెక్నాలజీ ఎంత ఎడ్వాన్స్‌ అయినా - జనం ఇది చాలంటూ ఒక చోట ఆగిపోతారు. 8K వచ్చినా 4K దగ్గరే మోడల్స్‌ ఆగిపోవడం - ఇదే సూచిస్తుంది.

Updated Date - 2020-03-15T01:16:47+05:30 IST