నెట్టింట హాట్‌టాపిక్‌గా మారిన సచిన్ కూతురు Sara Tendulkar.. ఆమె గురించి చాలామందికి తెలియని నిజాలివి..!

మాజీ దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది. క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో సారా ప్రేమాయణం సాగిస్తోందంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. తాజాగా సారా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కామెంట్ చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సారా టెండూల్కర్ గురించి నెటిజన్లు ఆసక్తిగా శోధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర అంశాలు తెర పైకి వచ్చాయి. 


ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో సారా ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. అనంతరం లండన్‌లో మెడిసిన్ చేసింది. తండ్రిలాగానే సారాకు కూడా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. వీలు కుదిరినప్పుడల్లా టూర్‌లకు వెళుతుంటుంది. తండ్రిలా స్పోర్ట్స్ పర్సన్ కాకపోయినా ఫిట్‌నెస్ విషయంలో సారా రాజీపడదు. జిమ్‌లో తన వర్కవుట్ ఫొటోలను సారా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. సారాకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 14 లక్షల మంది పాలోవర్లు ఉన్నారు.  


Advertisement

Bollywoodమరిన్ని...