వడ్డీ మాఫీ పథకం.. ఖాతాల్లోకి రూ.4,300 కోట్లు

ABN , First Publish Date - 2020-11-28T06:43:46+05:30 IST

రుణ మారటోరియం సమయంలో రుణ గ్రహీతల నుంచి వసూలు చేసిన వడ్డీని బ్యాంకులు, ఆర్థిక సంస్థ లు తమ ఖాతాదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాయి. ఈ నెల 13 వరకు ఈ పద్దు కింద 13.12 కోట్ల బ్యాంకు ఖాతాల్లో రూ. 4,300 కోట్లు

వడ్డీ మాఫీ పథకం.. ఖాతాల్లోకి రూ.4,300 కోట్లు

న్యూఢిల్లీ: రుణ మారటోరియం సమయంలో రుణ గ్రహీతల నుంచి వసూలు చేసిన వడ్డీని బ్యాంకులు, ఆర్థిక సంస్థ లు తమ ఖాతాదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాయి. ఈ నెల 13 వరకు ఈ పద్దు కింద 13.12 కోట్ల బ్యాంకు ఖాతాల్లో రూ. 4,300 కోట్లు జమ చేశాయని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు.కరోనా నేపథ్యంలో కేంద్రం ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు 8 రంగాలకు చెంది న రుణాల వసూళ్లపై మారటోరియం అమలు చేసింది. మారటోరియం తర్వాత కూడా చెల్లింపులు లేని రుణాలను ఎన్‌పీఏలుగా ప్రకటించేందుకు అనుమతించాలన్న బ్యాంకర్ల విజ్ఞప్తిపై విచారణను డిసెంబరు 2కు వాయిదా వేసింది. 

Updated Date - 2020-11-28T06:43:46+05:30 IST