రుణగ్రహీతలకు సీఎస్‌బీ గుడ్‌న్యూస్...

ABN , First Publish Date - 2020-12-02T02:16:02+05:30 IST

రుణగ్రహీతలకు ఒకటో తేదీ కానుకగా సీసీబీ(క్యాథలిక్ సిరియన్ బ్యాంక్) ఓ శుభవార్తనందించింది. రుణ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్ నుంచి రుణంతీసుకున్న వారికి ఈఎంఐ భారం తగ్గనుంది.

రుణగ్రహీతలకు సీఎస్‌బీ గుడ్‌న్యూస్...

తిరుచూర్ : రుణగ్రహీతలకు ఒకటో తేదీ కానుకగా సీఎస్‌బీ(క్యాథలిక్ సిరియన్ బ్యాంక్) ఓ శుభవార్తనందించింది. రుణ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్ నుంచి రుణంతీసుకున్న వారికి ఈఎంఐ భారం తగ్గనుంది.


ఎంసీఎల్ఆర్ రేటును తగ్గిస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. ఎంసీఎల్ఆర్ రేటులో 0.10 శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. అయితే... ఆరు నెలల కాల పరిమితిలోని రుణాలకు ఇది వర్తిస్తుంది. దీంతో రుణగ్రహీతలకు ప్రయోజనం కలుగుతుంది.


కొత్త రుణ రేట్లు ఈ రోజు(డిసెంబరు 1) నుంచే అమల్లోకి వచ్చాయి. ఇకపోతే ఏడాది కాలపరిమితిలోని ఎంసీఎల్ఆర్‌లో ఎలాంటి మార్పూ లేదు. ఏడాది కాల పరిమితిలో తీసుకునే రుణాలకు వడ్డీ రేటు 9.5 శాతంగా ఉంది. ఒక రోజు నుంచి ఆరు నెలల కాలపరిమితిలోని రుణాలపై ఎంసీఎల్ఆర్ 7.7 శాతం నుంచి 8.5 శాతం మధ్యలో ఉంది.


కాగా... కేవలం ఈ బ్యాంకు మాత్రమే కాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటివి కూడా ఎంసీఎల్ఆర్ రేటును సవరించాయి. ఇకపోతే సీఎస్‌బీ బ్యాంక్ ఇటీవలనే ఐపీవోకు కూడా వచ్చింది.


ఈ బ్యాంక్ ఐపీవోలో డబ్బులు పెట్టిన వారికి అదిరిపోయే రాబడి వచ్చింది. రూ. 195 పెట్టి షేర్లు కొంటే లిస్టింగ్‌లో షేరు ధర రూ. 275 వద్ద లిస్ట్ అయ్యింది. ఇకపోతే ఈ బ్యాంక్ ప్రధానంగా కేరళలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. తమిళనాడు, కర్నాటక, మహరాష్ట్రలో కూడా సేవలనందిస్తోంది.

Updated Date - 2020-12-02T02:16:02+05:30 IST