చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లపై కోత

ABN , First Publish Date - 2020-04-01T06:13:22+05:30 IST

జాతీయ పొదుపు సర్టిఫికెట్లు, ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌) వంటి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల ను ప్రభుత్వం 1.4 శాతం వరకు తగ్గించింది. బుధవారం నుంచి...

చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లపై కోత

న్యూఢిల్లీ: జాతీయ పొదుపు సర్టిఫికెట్లు, ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌) వంటి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల ను ప్రభుత్వం 1.4 శాతం వరకు తగ్గించింది. బుధవారం నుంచి అమల్లోకి వచ్చే కొత్త వడ్డీ రేట్లు జూన్‌ నెలాఖరు వరకు అమల్లో ఉంటాయి. చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు సవరిస్తుంటుంది. బ్యాంకు డిపాజిట్లపై తగ్గిన వడ్డీ రేట్లకు అనుగుణంగా ప్రభు త్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒకటి నుంచి మూడేళ్ల  కాలపరిమితి ఉండే డిపాజిట్లపై వడ్డీ రేటు 6.9 శాతం నుం చి 5.5 శాతానికి, ఐదేళ్ల కాలపరిమితి ఉండే డిపాజిట్లపై వడ్డీ రేటు 7.7 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గనుంది. అలాగే సీనియర్‌ సిటిజన్ల డిపాజిట్లపై వడ్డీ రేటు 8.6 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గనుంది. 

Updated Date - 2020-04-01T06:13:22+05:30 IST