రుణాలపై వడ్డీ రద్దు చేయాలి: ఇందిరా శోభన్‌

ABN , First Publish Date - 2020-04-03T07:50:56+05:30 IST

రైతులు, మహిళలు, పెన్షనర్లు, మధ్య తరగతి, అల్పాదాయ వర్గాల వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. వారు తీసుకున్న రుణాలపై 3నెలల వడ్డీని మాఫీ చేయాలని...

రుణాలపై వడ్డీ రద్దు చేయాలి: ఇందిరా శోభన్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): రైతులు, మహిళలు, పెన్షనర్లు, మధ్య తరగతి, అల్పాదాయ వర్గాల వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. వారు తీసుకున్న రుణాలపై 3నెలల వడ్డీని మాఫీ చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్‌ డిమాండ్‌ చేశారు. పొదుపు  డబ్బులపైన వడ్డీ శాతాన్ని మాత్రం యథాతథంగా ఉంచాలన్నారు. పొదుపు డిపాజిట్లపైన చెల్లించే వడ్డీని 1 నుంచి 1.5 శాతం తగ్గించించడం ద్వారా సుమారు రూ.19 వేల కోట్లను ఆయా వర్గాల జేబుల నుంచి ప్రభుత్వం లాక్కుంటోందని ఆరోపించారు. మూడు నెలల పాటు వెసులుబాటు కల్పించిన ఈఎంఐల పైన వడ్డీని మినహాయించాలన్నారు.

Updated Date - 2020-04-03T07:50:56+05:30 IST