టీడీఎస్‌ మినహాయింపు ఫైలింగ్‌కు మరింత సమయం

ABN , First Publish Date - 2020-04-05T06:06:08+05:30 IST

వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ మినహాయింపు కోరే వ్యక్తులు జూన్‌ 30 తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫారమ్‌ 15జీ, 15హెచ్‌లను సమర్పించేందుకు ఆదాయ పన్ను శాఖ అనుమతిచ్చింది.

టీడీఎస్‌ మినహాయింపు ఫైలింగ్‌కు మరింత సమయం

వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ మినహాయింపు కోరే వ్యక్తులు జూన్‌ 30 తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫారమ్‌ 15జీ, 15హెచ్‌లను సమర్పించేందుకు ఆదాయ పన్ను శాఖ అనుమతిచ్చింది. కరోనా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పన్ను విధింపు పరిమితికన్నా తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు ఫారమ్‌ 15జీ, 15 హెచ్‌లను సమర్పించడం ద్వారా వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ (మూలం వద్ద పన్ను) విధించకుండా మినహాయింపు కోరుతారు. ఈ ఫారాలను పన్ను చెల్లింపుదారులు తమ బ్యాంకులు లేదా ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్లకు ఏప్రిల్‌లో సమర్పించాల్సి ఉంటుంది.

Updated Date - 2020-04-05T06:06:08+05:30 IST