అంతర్‌ జిల్లాల దొంగలు అరెస్టు

ABN , First Publish Date - 2022-08-11T04:31:36+05:30 IST

పట్టపగలు ఇళ్లలో చోరీలకు పాల్పడే ఇరువురు అం తర్‌ జిల్లాల దొంగలను కురిచేడు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.30.72లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

అంతర్‌ జిల్లాల దొంగలు అరెస్టు
సొత్తును చూపిస్తున్న ఎస్పీ, ఇతర పోలీసు అధికారులు

17 కేసులను ఛేదించిన కురిచేడు పోలీసులు

రూ.30.72లక్షల సొత్తు స్వాధీనం 

వెల్లడించిన ఎస్పీ మలికగర్గ్‌


ఒంగోలు(క్రైం), ఆగస్టు 10: పట్టపగలు ఇళ్లలో చోరీలకు పాల్పడే ఇరువురు అం తర్‌ జిల్లాల దొంగలను కురిచేడు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.30.72లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిం దితులు గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో 17దొంగతనాలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణంలో గల గెలాక్సీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ మలికగర్గ్‌ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం పెద్దకంచర్ల గ్రామానికి చెందిన గుడిపాటి వీ రాంజి, శావల్యపురం మండలం చినకంచర్ల గ్రామానికి చెందిన గోపు శ్రీనివాసరావును కురిచేడు పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. వీరాంజి దొంగతనాలు చేసి తెచ్చిన సొత్తును గోపు శ్రీనివాసరావుకు వి క్రయిస్తూ ఉంటాడు. వీరి ఇరువురును కురిచేడులోని వెంగాయిపాలెం చెక్‌పోస్టు వద్ద అరెస్టు చేసి వారి వద్ద 640 గ్రాములు బంగారం, మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ తెలిపారు. వాటి వి లువ సుమారు రూ.30.72లక్షలు ఉంటుందన్నారు. కాగా ఇంటికి తా ళం వేసి ఊరు వెళ్లే సమయంలో ఇంట్లో విలువైన వస్తువులు ఉంచకూడదని, పోలీసుల సహకారంతో లాక్డ్‌ మానిటర్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేయించుకోవాలన్నారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు ఉంటే 100కు డ యల్‌ చేయాలని ఎస్పీ కోరారు. అలాగే అదనపు ఎస్పీ(క్రైం) ఎస్‌వీ.శ్రీధర్‌రావు, దర్శి డీఎస్పీ నారయణస్వామిరెడ్డి, త్రిపురాతకం సీఐ ఎం.రాంబాబు, కురిచేడు ఎస్సై పి.శివనాగరాజులను ఎస్పీ అభినందించారు.  


మహిళ హత్య కేసులో ఇరువురు అరెస్టు

మహిళ హత్యకేసులో నిందితులను త్రిపురాంతకం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని ఎస్పీ మలికగర్గ్‌ తెలిపారు. త్రిపురాంతకం మండలం డీవీఎన్‌కాలనీకి చెందిన పొన్న అంకమ్మ ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. భర్త మృతి చెందాడు. దీంతో అదే గ్రామానికి చెందిన మెండ్రు గుత్తి ఆంజనేయులు, మరో  బాలుడు కలిసి ఆమెను గత జూన్‌ 26న రాత్రి హత్య చేసి ఆమె వద్ద ఉన్న నగదు, బంగారం దొంగిలించారు. మృతదేహన్ని అదే గ్రామం సమీపంలో ఉన్న కొక్కిలేరు కాలువలో పడవేసారని ఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్టు చేసిన త్రిపురాంతకం పోలీసులను ఎస్పీ అభినందించారు. 

Updated Date - 2022-08-11T04:31:36+05:30 IST