అంతర్‌ జిల్లా రాగి తీగల దొంగల ముఠాఅరెస్టు

ABN , First Publish Date - 2021-01-27T06:30:55+05:30 IST

ట్రాన్స్‌ఫార్మర్‌ల రాగితీగలను దొంగలించే దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

అంతర్‌ జిల్లా రాగి తీగల దొంగల ముఠాఅరెస్టు
స్వాధీనం చేసుకున్న ట్రాన్స్‌ ఫార్మర్‌ రాగి తీగలు

లక్ష రూపాయల విలువ గల రాగి తీగల స్వాధీనం 

విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి 

సోన్‌, జనవరి 26 : ట్రాన్స్‌ఫార్మర్‌ల రాగితీగలను దొంగలించే దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. మండల కేంద్రానికి సమీపంలోని మాదాపూర్‌ జాతీయ రహదారి పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పగులగొట్టి రాగి తీగలను దొంగలిస్తుండగా పక్కనే ఉన్న పెట్రోల్‌పంపు సిబ్బంది సోన్‌ పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ ఆసీఫ్‌ ఆధ్వర్యంలో ఇద్దరు దొంగలను పట్టుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. దొంగతనానికి పాటు పడిన వారిలో నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం దూదిగాం గ్రామానికి చెందిన మహమ్మద్‌ ఆలీ, మెండోరా మండల కేంద్రానికి చెందిన అంకుష్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరు చెడు అలవాట్లకు బానిసై నిర్మల్‌, నిజామాబాద్‌ తదితర జిల్లాల్లో దొంగ తనాలకు పాటు పడుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌లో 2, లోకేశ్వరంలో 1, మామడలో 1, సోన్‌లో 1 మొత్తం ఐదు ట్రాన్స్‌ ఫార్మర్‌లను ధ్వంసం చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి లక్ష రూపాయల విలువ గల రాగి తీగలను స్వాధీనం చేసుకొని ఇద్దరికి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. 24గంటల్లో కేసు  చెధించిన సోన్‌ ఎస్‌ఐ ఆసిఫ్‌, సీఐ జీవన్‌రెడ్డిలను డీఎస్పీ అభినందించారు. 


Updated Date - 2021-01-27T06:30:55+05:30 IST