ప్రాణం తీసిన ఈత సరదా

ABN , First Publish Date - 2021-08-06T05:49:22+05:30 IST

క్వారీ నీటి గుంతలోకి ఈతకు దిగి విద్యార్థి తన్నీరు వెంకటేశ్వర్లు(17) మృతి చెందాడు. మండలంలోని మల్లాయపాలెం గ్రామానికి చెందిన తన్నీరు శ్రీనివాసరావు పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం బల్లికురవ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుతున్నాడు.

ప్రాణం తీసిన ఈత సరదా
వెంకటేశ్వర్లు మృతదేహం

క్వారీ గుంతలో దిగి ఇంటర్‌ విద్యార్థి మృతి 

మృతదేహాన్ని  బయటకు తీసిన కానిస్టేబుల్‌ 


బల్లికురవ, ఆగస్టు 5 : క్వారీ నీటి గుంతలోకి ఈతకు దిగి విద్యార్థి తన్నీరు వెంకటేశ్వర్లు(17) మృతి చెందాడు. మండలంలోని మల్లాయపాలెం గ్రామానికి చెందిన తన్నీరు శ్రీనివాసరావు పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం బల్లికురవ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుతున్నాడు. బుధవారం సాయం త్రం తనతో పాటు మరో నలుగురు మిత్రులతో క లిసి గ్రామానికి సమీపంలో ఉన్న గ్రానైట్‌ క్వారీ నీటి గుంతలో ఈత కొట్టేందుకు వెళ్లారు. మొదటి గా ముగ్గురు ఈతకు దిగారు. ఆ వెంటనే భయం తో ఇద్దరు బయటకు వచ్చారు. గుంత లోతు ఎ క్కువగా ఉండటంతో విద్యార్థి వెంకటేశ్వర్లు నీటిలోనే చిక్కుకుపోయాడు.  దీంతో భయపడిన  తో టి విద్యార్థులు గ్రామంలో ఎవరికీ చెప్పలేదు. తన కుమారుడు ఇంటికి రాకపోవటంతో వెంకటేశ్వర్లు తండ్రి మిగతా విద్యార్థులను అడగటంతో జరిగిన విషయాన్ని గురువారం ఉదయం వారు చెప్పా రు. వెంటనే పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇవ్వటంతో పోలీసులు నీటి గుంతలో గాలించగా వి ద్యార్థి మృతదేహం బయటపడింది. మృతుడి తం డ్రి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ శివనాంచారయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


కానిస్టేబుల్‌ సాహసం


విద్యార్థి తన్నీరు వెంకటేశ్వర్లు గ్రానైట్‌ క్వారీ నీటి గుంతలో పడ్డాడని సమాచారం అందటంతో ఎస్‌ఐ శివనాంచారయ్య సూచనతో బల్లికురవ స్టే షన్‌ కానిస్టేబుల్‌ ఇస్లావత్‌ మార్కండేయనాయక్‌ వెంటనే సంఘటన స్థలానికి వెళ్లారు. సుమారు 40 అడుగుల లోతు ఉన్న నీటి గుంతలోకి దిగి వి ద్యార్థి కోసం సుమారు రెండు గంటలపాటు గాలి ంచారు. అనంతరం వెతుకులాటలో బండరాయి పక్కన ఉన్న వెంకటేశ్వర్లు మృతదేహాన్ని కానిస్టేబుల్‌ బయటకు తీశారు. విద్యార్థి మృతదేహాన్ని ఎంతో సాహసంతో బయటకు తీసిన కానిస్టేబుల్‌ ను గ్రామస్థులు అభినందించారు.


Updated Date - 2021-08-06T05:49:22+05:30 IST