Abn logo
Apr 21 2021 @ 01:11AM

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబీకులు

కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు


తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్‌ 20: ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థిని ఒకరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎంఆర్‌పల్లె సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పీలేరు మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన రామచంద్రరాజు కుమార్తె చరిత (16) తిరుపతి ఉప్పరపల్లెలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతూ.. ఆ విద్యాసంస్థకు చెందిన హాస్టల్లోనే ఉంటోంది. రోజులాగే తరగతులకు హాజరైన ఆమె సాయంత్రం హాస్టల్‌ గదికి చేరుకుంది. ఏమైందో తెలియదుగాని.. హాస్టల్‌ బాత్‌రూమ్‌లో చున్నీతో ఉరేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. ఆమె శరీరంపై గాయలున్నాయని, వేధించి హత్యచేసి ఉంటారని అనుమానంగా ఉందని మృతురాలి సోదరుడు లక్ష్మణ్‌రాజు, కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement