అంతర్‌ జిల్లాల దొంగలు అరెస్టు

ABN , First Publish Date - 2021-07-31T05:24:22+05:30 IST

అంతర్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోటా రు సైకిళ్ల చోరీలకు పా ల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి 4 లక్షల విలువ చేసే 21 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నా మని, మరో నాలుగు బైక్‌లు ఎక్సైజ్‌ శాఖ ఆధీనంలో ఉన్నాయని జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఆర్‌.రవికిరణ్‌ తెలిపారు.

అంతర్‌ జిల్లాల దొంగలు అరెస్టు
స్వాధీనం చేసుకున్న బైక్‌లు

ముగ్గురి నుంచి 21 బైక్‌లు స్వాధీనం 


గోపాలపురం, జూలై 30 : అంతర్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోటా రు సైకిళ్ల చోరీలకు పా ల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి 4 లక్షల విలువ చేసే 21 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నా మని, మరో నాలుగు బైక్‌లు ఎక్సైజ్‌ శాఖ ఆధీనంలో ఉన్నాయని జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఆర్‌.రవికిరణ్‌ తెలిపారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఆయన విలేకర్ల సమా వేశంలో మాట్లాడారు. గోపాలపురం మండలం భీమోలుకు చెందిన గంటా మురళీకృష్ణ, కరగపాడుకు చెందిన వనమ చంద్రశేఖర్‌ వీరిద్దరూ కలిసి నాటు సారా వ్యాపారం చేస్తూ అప్పుడప్పుడు ఎక్సైజ్‌ శాఖ అధికారులకు పట్టుబడుతూ ఉండేవారన్నారు. ఈవిధంగా సొంత వాహనాలు సీజ్‌ కావడంతో సారా వ్యాపా రంలో అధిక నష్టాలు వచ్చినట్టు తెలిపారు. పాత నేరస్తుడైన తూర్పు గోదావరి జిల్లా కడియంకు చెందిన మంజునాథ్‌ అనే వ్యక్తిని పరిచయమైంది. అతని సాయంతో రాజమండ్రి, బొమ్మూరు, ధవళేశ్వరం, విశాఖపట్నం, ఏలూరు, కొవ్వూరు, తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో దొంగతనం చేసిన బైక్‌లపై సారా వ్యాపారం చేద్దామని దొంగిలించిన  బైక్‌లను తక్కువ రేటుకు విక్రయించి అధిక లాభాలు పొందవచ్చని పథకం రచించారు. సారా కేసులో ఈ ప్రాంతానికి చెందిన బైక్‌లు ఎక్కువగా సీజ్‌ అవుతుండడంతో అనుమానం వచ్చి పూర్తిస్థాయిలో వీటిపై దర్యాప్తు చేశామన్నారు. దర్యాప్తులో అసలు బైకు దొంగలు దొరికారని వీరిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశామన్నారు. వీరిని కొవ్వూరు కోర్టుకు హాజరు పరుస్తామన్నారు. ఎస్‌ఐ ఎంవీ సుబ్రహ్మణ్యం, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం సీఐ గౌరీ శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-31T05:24:22+05:30 IST