చైనాను ఎదుర్కొనేందుకు జట్టు కట్టిన 8 దేశాల పార్లమెంటేరియన్లు

ABN , First Publish Date - 2020-06-07T00:47:36+05:30 IST

పంచ వాణిజ్యం, భద్రత, మానవ హక్కులకు చైనా వల్ల ముప్పు పొంచి

చైనాను ఎదుర్కొనేందుకు జట్టు కట్టిన 8 దేశాల పార్లమెంటేరియన్లు

న్యూఢిల్లీ : ప్రపంచ వాణిజ్యం, భద్రత, మానవ హక్కులకు చైనా వల్ల ముప్పు పొంచి ఉందని చాలా దేశాలు భావిస్తున్నాయి. దీంతో అమెరికా సహా ‘ దేశాల పార్లమెంటేరియన్లు చైనాను దీటుగా ఎదుర్కొనే లక్ష్యంతో జట్టు కట్టారు. 


ఆర్థిక, దౌత్య రంగాల్లో చైనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు ఓ సమన్వయంతో కూడిన కూటమిని ఏర్పాటు చేయాలని అమెరికా ప్రయత్నిస్తోంది. హాంగ్ కాంగ్ సిటీ స్వయం ప్రతిపత్తికి చైనా విఘాతం కలిగించడాన్ని ఖండిస్తున్న దేశాల్లో అమెరికా ముందు వరుసలో ఉంది. 


ఈ నేపథ్యంలో అమెరికా, జర్మనీ,  బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, స్వీడన్, నార్వే, అదేవిధంగా యూరోపియన్ పార్లమెంటు సభ్యులు కలిసి చైనాపై ఇంటర్ పార్లమెంటేరియన్ అలయెన్స్‌ను ఏర్పాటు చేశారు. 


చైనాకు సంబంధించిన అంశాలపై వ్యూహాత్మక, క్రియాశీలక వైఖరిని రూపొందించేందుకు తాము కూటమిగా ఏర్పడినట్లు ఇంటర్ పార్లమెంటేరియన్ అలయెన్స్‌ తెలిపింది. తాము తగిన, సమన్వయంతో కూడిన పరిష్కారాలను రూపొందిస్తామని పేర్కొంది. 


అమెరికా రిపబ్లికన్ సెనేటర్ మార్కో రుబియో, డెమొక్రాట్ బాబ్ మెనెండెజ్, జపాన్ మాజీ రక్షణ మంత్రి జెన్ నకటని, యూరోపియన్ పార్లమెంటు విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడు మిరియం లెక్స్‌మన్, ప్రముఖ బ్రిటన్ కన్జర్వేటివ్ లా మేకర్ లెయిన్ డంకన్ స్మిత్ ఈ గ్రూప్‌లో ఉన్నారు.


చైనీస్ కమ్యూనిస్టు పార్టీ పాలనలో చైనా ప్రపంచానికి సవాలుగా మారిందని రుబియో అన్నారు. 

Updated Date - 2020-06-07T00:47:36+05:30 IST