Cell Phone వాడొద్దన్నందుకు ఇంటర్‌ విద్యార్థిని బలవన్మరణం

ABN , First Publish Date - 2022-03-06T12:20:50+05:30 IST

Cell Phone వాడొద్దన్నందుకు ఇంటర్‌ విద్యార్థిని బలవన్మరణం

Cell Phone వాడొద్దన్నందుకు ఇంటర్‌ విద్యార్థిని బలవన్మరణం

తిరుపతి : సెల్‌ఫోన్‌ వాడొద్దని తల్లి మందలించడంతో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శనివారం తిరుపతి ఈస్ట్‌ ఎస్‌ఐ జయస్వాములు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలలో కుంకుమ వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్న బాలాజీ తన కుటుంబంతో కలిసి కొర్లగుంటలో నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తె కె.వాణిశ్రీ నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. శుక్రవారం రాత్రి చాలాసేపటి నుంచి వాణిశ్రీ తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ చూస్తుండటంతో.. చదువుపై శ్రద్ధ పెట్టడం లేదని తల్లి మందలించింది. దాంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఇంటి మిద్దెపై ఉన్న గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. కొంతసేపటి తర్వాత గమనించిన కుటుంబీకులు రుయాస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


టెన్త్‌ విద్యార్థి ఆత్మహత్య

ఇదిలా ఉంటే.. కలకడ మండల పరిధిలోని ఎర్రకోటపల్లె పంచాయతీ సింగనొడ్డుపల్లెలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి శనివారం సాయంత్రం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసు కున్నాడు. ఎస్‌ఐ రవిప్రకాష్‌రెడ్డి కథనం మేరకు.. సింగనొడ్డుపల్లెకు చెందిన సాయి(16) గుర్రం కొండలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. సాయంత్రం పాఠశాల నుంచి ఇంటిటిటటొఒటకి వచ్చిన విద్యార్థి సమీపంలో ఓ చెట్టుకు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. గ్రామస్థులు అక్కడకు చేరుకొని సాయిని కిందకు దించి ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి తల్లి కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-03-06T12:20:50+05:30 IST