ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-26T06:39:24+05:30 IST

ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజున 91.25 శాతం మంది విద్యార్థు

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు ప్రారంభం
భువనగిరిలో పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న నోడల్‌ అధికారి సంజీవ

తొలిరోజు 6865 మంది హాజరు, 658 మంది గైర్హాజరు

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన నోడల్‌ అధికారి సంజీవ

భువనగిరిటౌన్‌, అక్టోబరు 25: ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజున 91.25 శాతం మంది విద్యార్థులు తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ పరీక్షలకు హాజరయ్యారు. జిల్లాలో ఏర్పాటుచేసిన 44 పరీక్షా కేంద్రాల్లో 7,523 మంది విద్యార్థులకు మొదటి రోజున 6,865 మంది హాజరుకాగా, 658 మంది గెర్హాజరయ్యారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌  పరీక్షలు నిర్వహించి శానిటైజ్‌ చేశారు. గంట ముందుగానే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ప్రతీపరీక్ష కేంద్రంలో వైద్య ఆరోగ్య సిబ్బంది విధులు నిర్వహించగా, పోలీసులు 144 సెక్షన్‌ను అమలుచేశారు. ఇంటర్‌ నోడల్‌ అధికారి బి.సంజీవ, ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌లు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.

Updated Date - 2021-10-26T06:39:24+05:30 IST