ఇంటర్‌ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2020-02-20T09:09:08+05:30 IST

జిల్లాలో ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌-2 జి. రాజకుమారి అన్నారు. పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్‌లో బుధవారం

ఇంటర్‌ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలి

కలెక్టరేట్‌, ఫిబ్రవరి 19: జిల్లాలో ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌-2 జి. రాజకుమారి అన్నారు. పరీక్షల నిర్వహణపై  కలెక్టరేట్‌లో బుధవారం  విద్యాశాఖ అధికారులతో సమీక్ష  నిర్వహించారు.  జిల్లాలో 139 పరీక్షా కేంద్రాలను వినియోగిస్తున్నట్లు చెప్పారు. పరీక్షలు మార్చి 4 నుంచి 23 వరకు జరుగుతాయన్నారు.. ప్రతి ఎగ్జామ్‌ హాల్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రం వెలుపల కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు.


పరీక్షా కేంద్రాల్లో లైటింగ్‌, ఫ్యాన్లు, ఉండాలన్నారు. తాగునీరు, వైద్య, నిరంతర విద్యుత్‌ సదుపాయం ఉండేలా అధికారులు కృషి చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్‌ సెంటర్లు మూసివేయాలన్నారు. 144 సెక్షన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో ఇంటర్‌ విద్యా ఆర్‌ఐవో ఐ.శారద మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1,15,504 మంది విద్యార్థులు పరీక్షలను రాస్తున్నారన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. సమావేశంలో డీఈవో అబ్రహం, జిల్లా పరీక్షల నిర్వహణాధికారి ఎస్‌వీవీ సత్యనారాయణరెడ్డి, ఆర్టీసీ డీఎం పి.ప్రభాకరరావు, అధికారులు విశ్వేశ్వరరావు, రాజబాబు, ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-20T09:09:08+05:30 IST