ముగిసిన అంతర్‌ జిల్లాల ఖోఖో టోర్నమెంట్‌

ABN , First Publish Date - 2022-10-01T05:18:19+05:30 IST

అంతర్‌జిల్లాల రాష్ట్రస్థాయి 32వ సబ్‌జూనియర్‌ ఖోఖో టోర్న మెంట్‌ శుక్రవారం జడ్చర్లలోని బాదేపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ గ్రౌండ్‌లో ముగిసింది.

ముగిసిన అంతర్‌ జిల్లాల ఖోఖో టోర్నమెంట్‌
ఖోఖో టోర్నమెంట్‌ విజేతలకు బహుమతులు అందిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

- బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి 

జడ్చర్ల, సెప్టెంబరు 30 : అంతర్‌జిల్లాల రాష్ట్రస్థాయి 32వ సబ్‌జూనియర్‌ ఖోఖో టోర్న మెంట్‌ శుక్రవారం జడ్చర్లలోని బాదేపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ గ్రౌండ్‌లో ముగిసింది. అంతర్‌ జిల్లాల టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలలో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయనున్నారు. ఈ టోర్నమెంట్‌లో బాలికల విభాగంలో వరుస స్థానాలలో వరంగల్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఖమ్మం జట్లు నిలిచాయి. అలాగే బాలుర విభాగంలో వరుస స్థానాలలో కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, రంగారెడ్డి జిల్లా జట్టు నిలిచాయి. ఈ సందర్భంగా ఆయా జట్టు సభ్యులకు బహుమతులను ఎమ్మెల్యే డా. సి.లక్ష్మారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖోఖో అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి విలియమ్స్‌, పీఈటీలు మోయిన్‌, కృష్ణయ్య, రాములు, భానుకిరణ్‌, రామకృష్ణ, యాదయ్య, శారద, బాలరాజు, రాజవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. 

పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం 

బాదేపల్లి, సెప్టెంబరు 30: పేదలను ఆర్థికంగా ఆదుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డిలు అన్నారు. శుక్రవారం మునిసిపల్‌ పరిధిలోని కావేరమ్మపేట జీపీ ఫంక్షన్‌హాల్‌ బతుకమ్మ చీరలను  పంపిణీ చేశారు. వివిధ వార్డుల్లోనూ బతుకమ్మ చీరలను చైర్‌పర్సన్‌, కౌన్సిలర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీవైస్‌ చైర్మన్‌ యాదయ్య, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దోరేపల్లి లక్ష్మి, వైస్‌ చైర్‌సర్సన్‌ పాలాది సారిక, కౌన్సిలర్లు మహేష్‌, చైతన్య, ఉమాదే వి, జ్యోతి, సతీష్‌, వార్డు అధికారులు, మహిళలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-01T05:18:19+05:30 IST