చిత్తశుద్ధే ప్రధానం

ABN , First Publish Date - 2021-03-19T05:30:00+05:30 IST

ఒకసారి ఏసు ప్రభువును ఒక పరిసయ్యుడు తన ఇంటికి భోజనానికి పిలిచాడు. ఆ ఆహ్వానాన్ని మన్నించిన ఏసు ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. చేతులు కడుక్కోకుండా... నేరుగా భోజనం బల్ల దగ్గర కుర్చీలో కూర్చున్నాడు. అది చూసి, ఆ పరిసయ్యుడు ఆశ్చర్యం

చిత్తశుద్ధే ప్రధానం

ఒకసారి ఏసు ప్రభువును ఒక పరిసయ్యుడు తన ఇంటికి భోజనానికి పిలిచాడు. ఆ ఆహ్వానాన్ని మన్నించిన ఏసు ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. చేతులు కడుక్కోకుండా... నేరుగా భోజనం బల్ల దగ్గర కుర్చీలో కూర్చున్నాడు. అది చూసి, ఆ పరిసయ్యుడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అతని ప్రవర్తనను గమనించిన ఏసు ప్రభువు ఆ వ్యక్తినీ, భోజనానికి వచ్చిన ఇతరులనూ ఉద్దేశించి ‘‘ఓ పరిసయ్యులారా. మీరు బయటకు శుభ్రంగా కనిపిస్తూ, లోపల అంతా మురికిగా ఉన్న పాత్రల లాంటివారు. మీ అంతరంగాలు అత్యాశతో, దుష్ట చింతనతో నిండిపోయి ఉన్నాయి. బయటకు కనిపించే శరీరాన్నీ, లోపల ఉన్న శరీరాన్నీ తయారు చేసింది భగవంతుడే. ఆ విషయాన్ని అవివేకులైన మీరు తెలుసుకోవాలి. అంతరంగాన్ని ఉదారంగా మార్చుకోండి. పేదలకు దానధర్మాలు చేయండి. అప్పుడు మీలో అన్నీ పరిశుభ్రంగా ఉంటాయి. మీరు కూరగాయల్లో, ఆకుకూరల్లో... ఇలా ప్రతి దానిలో దశమభాగం (పదో వంతు) ఇస్తూ ఉంటారు. కానీ దేవుని ప్రేమనూ, న్యాయాన్నీ ఉపేక్షిస్తారు. దశమ భాగాన్ని ఇవ్వడం మీ బాధ్యతే! కానీ మిగిలిన వాటి మీద నిర్లక్ష్యం కూడదు. అంతేకాదు, దైవారాధన చేసే మందిరాల్లో, అంగడి వీధుల్లో అందరూ మిమ్మల్ని పలకరించడం, మీ పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం, మీకు నమస్కారాలు చేయడం అంటే మీకు ఎంతో ఇష్టం. మీ స్వభావాలు ఎలాంటివంటే... మీరు కంటికి స్పష్టంగా కనిపించని సమాధులలాంటివారు. జనం వాటి మీద నడిచి వెళ్తూ ఉంటారు. కానీ అవి ఉన్నాయనేది వాళ్ళకు తెలియదు’’ అంటూ వారి స్వభావాలను ఎత్తి చూపాడు. 

ప్రార్థనా స్థలాల్లో, దైవ మందిరాల్లో, తోటి విశ్వాసులతో జరిపే సమావేశాల్లో విపరీతమైన హడావిడి చేసేవారు కనిపిస్తూ ఉంటారు. గొప్ప విశ్వాసిగా తమను అందరూ గుర్తించాలని వారు కోరుకుంటారు. తాము ప్రదర్శించే క్రమశిక్షణనూ, పద్ధతులనూ అందరూ పాటించేలా చేయాలని తాపత్రయపడతారు.. ప్రతి ఒక్కరూ తమను మెచ్చుకోవాలని తపన పడతారు. కానీ వారు తమ అంతరంగాల్లోకి తొంగి చూసుకోరు. ‘నా విశ్వాసంలో ఏవైనా లోపాలున్నాయా?’ అనే ఆలోచన చేయరు. అలాంటివారైన పరిసయ్యుల వైఖరిని ఏసు ప్రభువు నిలదీశాడు.  దైవారాధనలో చిత్తశుద్ధి ప్రధానం. ఎదుటివారిలో లోటుపాట్లను ఎంచడానికి బదులు తమ అంతరంగంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలనేది ఆలోచించాలి. పరిశుద్ధమైన అంతరంగం దైవానుగ్రహాన్ని దగ్గర చేస్తుంది.చిత్తశుద్ధే ప్రధానం

ఒకసారి ఏసు ప్రభువును ఒక పరిసయ్యుడు తన ఇంటికి భోజనానికి పిలిచాడు. ఆ ఆహ్వానాన్ని మన్నించిన ఏసు ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. చేతులు కడుక్కోకుండా... నేరుగా భోజనం బల్ల దగ్గర కుర్చీలో కూర్చున్నాడు. అది చూసి, ఆ పరిసయ్యుడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అతని ప్రవర్తనను గమనించిన ఏసు ప్రభువు ఆ వ్యక్తినీ, భోజనానికి వచ్చిన ఇతరులనూ ఉద్దేశించి ‘‘ఓ పరిసయ్యులారా. మీరు బయటకు శుభ్రంగా కనిపిస్తూ, లోపల అంతా మురికిగా ఉన్న పాత్రల లాంటివారు. మీ అంతరంగాలు అత్యాశతో, దుష్ట చింతనతో నిండిపోయి ఉన్నాయి. బయటకు కనిపించే శరీరాన్నీ, లోపల ఉన్న శరీరాన్నీ తయారు చేసింది భగవంతుడే. ఆ విషయాన్ని అవివేకులైన మీరు తెలుసుకోవాలి. అంతరంగాన్ని ఉదారంగా మార్చుకోండి. పేదలకు దానధర్మాలు చేయండి. అప్పుడు మీలో అన్నీ పరిశుభ్రంగా ఉంటాయి. మీరు కూరగాయల్లో, ఆకుకూరల్లో... ఇలా ప్రతి దానిలో దశమభాగం (పదో వంతు) ఇస్తూ ఉంటారు. కానీ దేవుని ప్రేమనూ, న్యాయాన్నీ ఉపేక్షిస్తారు. దశమ భాగాన్ని ఇవ్వడం మీ బాధ్యతే! కానీ మిగిలిన వాటి మీద నిర్లక్ష్యం కూడదు. అంతేకాదు, దైవారాధన చేసే మందిరాల్లో, అంగడి వీధుల్లో అందరూ మిమ్మల్ని పలకరించడం, మీ పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం, మీకు నమస్కారాలు చేయడం అంటే మీకు ఎంతో ఇష్టం. మీ స్వభావాలు ఎలాంటివంటే... మీరు కంటికి స్పష్టంగా కనిపించని సమాధులలాంటివారు. జనం వాటి మీద నడిచి వెళ్తూ ఉంటారు. కానీ అవి ఉన్నాయనేది వాళ్ళకు తెలియదు’’ అంటూ వారి స్వభావాలను ఎత్తి చూపాడు. 

ప్రార్థనా స్థలాల్లో, దైవ మందిరాల్లో, తోటి విశ్వాసులతో జరిపే సమావేశాల్లో విపరీతమైన హడావిడి చేసేవారు కనిపిస్తూ ఉంటారు. గొప్ప విశ్వాసిగా తమను అందరూ గుర్తించాలని వారు కోరుకుంటారు. తాము ప్రదర్శించే క్రమశిక్షణనూ, పద్ధతులనూ అందరూ పాటించేలా చేయాలని తాపత్రయపడతారు.. ప్రతి ఒక్కరూ తమను మెచ్చుకోవాలని తపన పడతారు. కానీ వారు తమ అంతరంగాల్లోకి తొంగి చూసుకోరు. ‘నా విశ్వాసంలో ఏవైనా లోపాలున్నాయా?’ అనే ఆలోచన చేయరు. అలాంటివారైన పరిసయ్యుల వైఖరిని ఏసు ప్రభువు నిలదీశాడు.  దైవారాధనలో చిత్తశుద్ధి ప్రధానం. ఎదుటివారిలో లోటుపాట్లను ఎంచడానికి బదులు తమ అంతరంగంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలనేది ఆలోచించాలి. పరిశుద్ధమైన అంతరంగం దైవానుగ్రహాన్ని దగ్గర చేస్తుంది.

Updated Date - 2021-03-19T05:30:00+05:30 IST