RGUKTలో ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌

ABN , First Publish Date - 2022-07-04T21:30:34+05:30 IST

నిర్మల్‌ జిల్లా బాసరలోని రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌(ఆర్‌జీయూకేటీ) - ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణ విద్యార్థుల కోసం 85 శాతం సీట్లు ప్రత్యేకించారు. మిగిలిన సీట్లకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పోటీపడవచ్చు

RGUKTలో ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌

నిర్మల్‌ జిల్లా బాసరలోని రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌(Rajiv Gandhi University of Knowledge Technologies)(ఆర్‌జీయూకేటీ) - ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణ విద్యార్థుల కోసం 85 శాతం సీట్లు ప్రత్యేకించారు. మిగిలిన సీట్లకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పోటీపడవచ్చు. ఇతర రాష్ట్రాల విద్యార్థుల కోసం గ్లోబల్‌ కేటగిరీ కింద అదనంగా అయిదు శాతం సూపర్‌ న్యూమరీ సీట్లు నిర్దేశించారు. పదోతరగతిలో సాధించిన మెరిట్‌ గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌ (జీపీఏ), రిజర్వేషన్‌ నిబంధనలు, కౌన్సెలింగ్‌  ప్రకారం అడ్మిషన్స్‌ ఇస్తారు. జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ పాఠశాలలు సహా నాన్‌ రెసిడెన్షియల్‌ గవర్నమెంట్‌ స్కూళ్లలో చదివిన విద్యార్థులకు నిబంధనల ప్రకారం వెయిటేజీ ఇస్తారు.


ప్రోగ్రామ్‌ వివరాలు: మొదటి రెండేళ్లు ప్రీ యూనివర్సిటీ కోర్సు ఉంటుంది. ఇందులో మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లీష్‌, తెలుగు/ సంస్కృతం, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ సబ్జెక్టులు ఉంటాయి. తరవాత నాలుగేళ్లపాటు బీటెక్‌ కోర్సు ఉంటుంది. ఇందులో కెమికల్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఒకదాన్ని ఎంచుకోవాలి.

అర్హత: తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పాఠశాలల నుంచి పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. సప్లిమెంటరీ అభ్యర్థులు దరఖాస్తుకు అనర్హులు. విద్యార్థుల వయసు డిసెంబరు 31 నాటికి 18 ఏళ్లు మించకూడదు.


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌, బీసీ అభ్యర్థులకు రూ.400; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.350; ఇతర రాష్ట్రాల విద్యార్థులకు రూ.1200; గ్లోబల్‌ కేటగిరీలో మిగిలిన సీట్లకు పోటీ పడే విద్యార్థులకు రూ.1200; విదేశీ విద్యార్థులకు 40 యూఎస్‌ డాలర్లు  

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 15 

స్పెషల్‌ కేటగిరీ (పీహెచ్‌/ సీఏపీ/ ఎన్‌సీసీ/స్పోర్ట్స్‌) విద్యార్థుల దరఖాస్తు ప్రింట్‌ కాపీలు స్పీడ్‌/ రిజిస్టర్డ్‌ పోస్ట్‌ ద్వారా చేరేందుకు చివరి తేదీ: జూలై 19

ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల: జూలై 30 నుంచి

చిరునామా: కన్వీనర్‌, యూజీ అడ్మిషన్స్‌, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌, బాసర, నిర్మల్‌ జిల్లా - 504107

వెబ్‌సైట్‌: www.rgukt.ac.in

Updated Date - 2022-07-04T21:30:34+05:30 IST