కొవిడ్‌ మృతులకు అంత్యక్రియలు జరిపే సిబ్బందికి బీమా!

ABN , First Publish Date - 2021-06-23T09:22:31+05:30 IST

కొవిడ్‌ మృతులకు అంత్యక్రియలు నిర్వహించే సిబ్బందిని బీమా (ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ఇన్సురెన్స్‌ స్కీం-పీఎంజీకేఐఎస్‌) పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది

కొవిడ్‌ మృతులకు అంత్యక్రియలు జరిపే సిబ్బందికి బీమా!

పరిశీలిస్తామని సుప్రీంకు చెప్పిన కేంద్రం


న్యూఢిల్లీ, జూన్‌ 22: కొవిడ్‌ మృతులకు అంత్యక్రియలు నిర్వహించే సిబ్బందిని బీమా (ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ఇన్సురెన్స్‌ స్కీం-పీఎంజీకేఐఎస్‌) పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం ఇవ్వాలంటూ దాఖలైన రెండు వ్యాజ్యాలపై ప్రత్యేక ధర్మాసనం తమ తీర్పును రిజర్వ్‌ చేసింది. కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నవారికి బీమా వర్తించడంలేదనే విషయాన్ని ధర్మాసనం దృష్టికి అడ్వకేట్‌ గౌరవ్‌ కుమార్‌ తెచ్చారు. ఈ సమస్య అర్థం చేసుకోదగినదేనని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-23T09:22:31+05:30 IST