Abn logo
Sep 21 2021 @ 13:52PM

ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లంకు అవమానం

విజయవాడ: సీఎం జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలోనే.. వాణిజ్య ఉత్సవ్ పేరిట ఏపీ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లంకు తీవ్ర అవమానం జరిగింది. ప్రొటోకాల్ కూడా పాటించకుండా.. ఆయన్ను వెనుక వరుసలో కూర్చోబెట్టారు. దీంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలిసింది. అనంతరం స్టేజ్‌పైకి పిలిచినా వెళ్లలేదని సమాచారం. ప్రోటోకాల్ ప్రకారం మంత్రి స్థాయి హోదా ఉన్నా.. అజయ్ కల్లంకు ఆమేరకు గౌరవం ఇవ్వలేదు.  పరిశ్రమల శాఖల అధికారుల వైఖరితో ముఖ్యులకు కేటాయించిన వరుసలో ఖాళీ ఉన్న వెనుక వరుసలో కూర్చున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ , మంత్రులు , ఉన్నతాధికారులు హాజరైన సదస్సులో కూడా అజయ్ కల్లం వెనుకవరుసలో కూర్చోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండిImage Caption