Abn logo
Oct 17 2021 @ 14:04PM

తెలంగాణ భవన్ దగ్గర కర్నె ప్రభాకర్‌కు అవమానం

హైదరాబాద్: తెలంగాణ భవన్ దగ్గర మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌కు అవమానం జరిగింది. తెలంగాణ భవన్ గేటు దగ్గర కర్నెను పోలీసులు ఆపారు. లోపలికి అనుమతిలేదని  పోలీసులు నిరాకరించారు. ప్లీనరీ మీడియా కోఆర్డినేటర్‌గా కర్నె ప్రభాకర్ వ్యవహరిస్తున్నారు. తాను ఎంత చెప్పినా లిస్ట్‌లో తన పేరు లేదని పోలీసులు అడ్డుకున్నారని ప్రభాకర్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై చర్చించే అవకాశమున్నట్లు సమాచారం. అలాగే ఈనెల 25న జరగనున్న ప్లీనరీపై కూడా చర్చించనున్నట్లు తెలియవచ్చింది.

ఇవి కూడా చదవండిImage Caption

తెలంగాణ మరిన్ని...