పండ్లతో తక్షణ శక్తి!

ABN , First Publish Date - 2021-04-25T05:30:00+05:30 IST

వేసవిలో పండ్లు అధికంగా తినడం ద్వారా డీహైడ్రేషన్‌ బారినపడకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా శరీరానికి కావలసిన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి...

పండ్లతో తక్షణ శక్తి!

  1. వేసవిలో పండ్లు అధికంగా తినడం ద్వారా డీహైడ్రేషన్‌ బారినపడకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా శరీరానికి కావలసిన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. 
  2. బ్లూబెర్రీస్‌, స్ట్రాబెర్రీస్‌, రాస్ప్‌బెర్రీస్‌, బ్లాక్‌బెర్రీస్‌, గూస్‌బెర్రీస్‌ అని రకరకాల బెర్రీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలోయాంటీఆక్సిడెంట్లు, విటమిన్స్‌, తగినంత ఫైబర్‌ లభిస్తుంది. రోజూ అరకప్పు నుంచి ఒక కప్పు బె ర్రీస్‌ తీసుకోవాలి. గ్రిల్డ్‌ మీట్‌, సలాడ్స్‌తో కలిపి కూడా బెర్రీస్‌ తినొచ్చు.
  3. యాపిల్స్‌, పియర్స్‌లో చక్కెర శాతం తక్కువగా, ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 
  4. నిమ్మజాతి పండ్లలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. కానీ ద్రాక్ష పండ్లలో ఉండదు. వీటిని సలాడ్స్‌తో కలిపి తీసుకోవచ్చు. ద్రాక్షను అవకాడో ముక్కలతో కలిపి తీసుకుంటే మరింత ఆస్వాదించవచ్చు.
  5. యాపిల్స్‌, పియర్స్‌లో మాదిరిగానే అప్రికాట్స్‌ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా విటమిన్‌ సి, ఫైబర్‌ అధికంగా లభిస్తుంది. 
  6. అరటిపండ్లు ఏడాది పొడవునా లభిస్తాయి. వీటిని ఎనర్జీ పవర్‌ హౌజ్‌లుగా చెప్పుకోవచ్చు. 
  7. వేసవిలో ముందుగా ఇష్టపడేది మామిడిపండ్లనే. ఈ సీజన్‌లోనే మామిడి పండ్లు లభిస్తాయి. నేరుగా తినే కన్నా జ్యూస్‌ రూపంలో తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. శరీరానికి కావలసిన పోషకాలు సమకూరుతాయి.

Updated Date - 2021-04-25T05:30:00+05:30 IST